పుట:Srinadhakavi-Jeevithamu.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
81
చతుర్ధాధ్యాయుము


యవివేకతను దుర్బలత్వమును వేనోళ్ళఁ జాటుచుండెను. ఇదియె కుమా రగిరిరెడ్డి యనంతరము రెడ్డి రాజులలో ముఖ్యముగా పెదకోమటి వేమా రెడ్డికిని 'కాటయ వేమా రెడ్డి ని వివాదములు కలుగుటకును, కోమటి వే మారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజ్యము నాక్రమించుటకును గారణమయ్యెను. తన పూర్వులవలెనె కుమారగిరి రెడ్డికూడ విద్యాభిరతి గలిగి విద్వాంసుల నాదరించి పోషించుట యెగాక తానును విద్వాంసుఁడై సంస్కృత భాష లో వసంత రాజీయ" మను పేరిట నాట్యశాస్త్రమును రచించినట్లు దె లియుచున్నది.

ఇతని మేనమరది కాటయవేముఁడును కాళిదాసకృతనాటక త్రయము నకు (అభిజ్ఞాన శాకుంతలము , మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయ ము) వ్యాఖ్య రచియించెను. ఈవ్యాఖ్యానములోఁ దఱచుగాఁ బలు తావుల వసంత రాజీయమునుండి ప్రమాణవాక్యములు గైకొనఁ బడుచు వచ్చెను. కుమారగిరి రెడ్డికి వసంతరాజనం బేరుగలదు గావునఁ దత్కృ తమైన నాట్యశాస్త్రమునకు వసంత రాజీయ మను పేరుగలిగినది. ఇపు డెచ్చటను దీని పొడ గానరాదు. శాకుంతల వ్యాఖ్యయం డిట్లున్నది.

శ్లో. మునీనాంభరతా దీనాంభోజూ దీనాంద భూభుజూన్
శాస్త్రాణి సన్యు గాలో చ్య నాట్య వేదార్థ వేది నామ్
పోక్తం వసంత రాజేన కుమారగిరి భూభుజా నామ్నా
వసంత రాజీయ నాట్య శాస్త్రయ దుత్త మమ్,

వసంతోత్సవములతోడను, వేశ్యాంగనా నర్తనములతోడను ననవరతము భోగైకపరాయణుండై కుమారగిరినామసూత ప్రభువై సింహాసన మధిష్ఠించియుండియు రాజ్యమును మఱచియుండఁగా మహా సమర్దుం డగు కాటయ వేముఁడు రాజ్యమును నిరాటంకముగా సంర క్షించుచుఁ బరిపాలించుచుండెను.

మాళవికావ్యాఖ్యయం దిట్లున్నది.

శ్లో, భాగ్యం నా మసమగ్ర మీదృశమతి న్నే హైక పౌత్రం యతో
హీం 'కాటయ వేమ ముద్ధత రిపుద్వంసే నే నియుజ్య స్వయమ్