పుట:Srinadhakavi-Jeevithamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

83


ఫీరోజుషాహకును విక్రయించు చుండెడి వాఁడు. ఇతనిమూలముననే మన కుమారగిరి కీర్తిలతాధిష్ఠి శౌష్టావశద్వీపాంతరాళుం డయినది. ఇట్లగుట చేతనే కుమారగిరి వసంతవృపొలునివన సౌందోలికాఛత్ర చామరతు రంగాది రాజచిహ్నములుంబడసినవాడుట. ఇతడు త్రిపురాంతక దేవ దివ్య శ్రీ పాదపద్మారాధకుఁడై కవినై గమిక నాదీ వాంశిక వై తాళి కాదు లగు స్ఫజనంబులకు సర్ధంబులు గుప్పించుధీరుండు, నుదారుండు, గంభీ రుండు, సదాచారుండు నన విఖ్యాతి గాంచినవాఁడట. ఇతని పితృపితా మహులు, మాతామహులుగూడ నిఖిలలోక ప్రసిద్ధ వాణిజ్య వంశధరుఁ లుగాఁ బ్రసిద్ధి గాంచిన వారేయట. అనచితిప్పయ స్థిరముగాఁ గొండవీట నిల్లుగట్టుకొని కాపురము చేయుచుండ వాడు గాఁడు. వసంతోత్సవ సమయములయందు ప్రతిసంవత్సరముఁ గొండవీటికి విచ్చేసి సుగంధిశాలను దెఱచి దానికధ్యక్షుడై వసంతభూ పాలునకుఁ గావలసిన సుగంధి ద్రవ్యంబు లోనగూర్చుచుండెడివాడు.

బాలకని శ్రీనాధునితోడిమైత్రి

చిన్నాఱి పోన్నాఱి చిఱుతకూకఁనాడనఁగాఁ బదునాలు గేండ్ల ప్రాయముననే య ప్రతిమాన ప్రతిభాశాలియై కవితావిద్య నలవఱుచుకొని, 'మరుత్తరాట్చరిత్రమును' రచించి కొండవీడున నొకింత పేరుమోసి క్రీ. శ. 1364 దవ సంవత్సర ప్రాంతమున వసంతభూపాలుఁడుచేయు వసంతోత్సవ సందర్భమున లక్ష్మీపుత్రుడయిన యవచి' తిప్పయ సెట్టి విద్వద్గోష్ఠి నున్న కాలమునఁ గవిపండిత బృందమునకుమ శారదా' విగ్రహముంబోలి కూరుచుండి యర్గళకవితాధారణ బ్రవహింపఁ జేయు చున్న 'బాలకవిని శ్రీనాథు గన్నుల గఱవుదీఱంగఁజూచు భాగ్యమా తనికి లభించి పరమానందభరితుఁడై యసత్కారములఁ బూజించెను. నాటి నుండి తిప్పయ సెట్టికీ బాలనఖు డుగనుండెను. కుమారగిరి రెడ్డి పరిపాల నముతో వసంతోత్సవములు ముగిసిపోయినవి. అన చితిప్పయ సెట్టికొండవీడు.