పుట:Srinadhakavi-Jeevithamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

శ్రీనాథకవి


నభిలషించుచు సమయమునకై నిరీక్షించి యుండెను. రాచకొండ దే వరకొండ దుర్గాధీశులగు పద్మనాయక దొరలును , శూరవరపట్టణాధీశ్వ రులగు రాచవారు. మొదలగువారును తన రాజ్య మాక్రమించుకొన వలయునని ప్రబల ప్రయత్నములు సలుపుచుండఁగా నీకుమారగిరి ప్ర భువు వసంతోత్సవములతోఁ గాలము గడపుచు రాజ్యభారము సంత' యును బంధువును, మంత్రియు, సేనాని యునైన కాటయ వేమా రెడ్డి పై నిడి ప్రమత్తుఁడై యుండెను. కుమారగిరిరెడ్డికిఁ దోఁబుట్టువు పెనిమిటి యైన 'కాటయ వేమా రెడ్డి మిక్కిలి సమర్థుఁడు గావుస గునూరగిరి రెడ్డి భూపాలుని కాలమున రాజ్య మన్యా క్రాంతము గాకుండ సంరక్షింప గలిగెను. కాటవేమా- రెడ్డి కర్ణాటక రాజ్యదీశుల తోడ మైత్రిగలిగి యుండి సంగ్రామధనంజయుడని విఖ్యాతిగాంచి శత్రు రాజుల కు భయం కరుఁడై మంత్రియు సేనానియునై తానే రాజ్య పరిపాలనము సేయు చుండెను. "కాటయ వేముఁడు కుమారగిరి రెడ్డికి ధర్మరాజునకు శ్రీకృష్ణు నీవలె మేనమఱదియు సచివుఁడుఁ జెలియునై యుండి రాజ్యమును సంర క్షించుచున్న వాడగుట చేత నితకి రాజమహేంద్రపురము రాజధాని గాగల తూర్పు దేశమును విడదీసి యిచ్చినట్టు తొత్త రమూడి శాసన ముద్ఘోషించు చున్నది.*[1] కాటయ వేముని భార్య మల్లాంబ తొత్తర మూఁడి శాసనములో నిట్లు తెలుపఁబడి యున్నది.


  • కాటయ వేముని భార్య మల్లాంబ తొత్తర మూఁడి శాసనములో నిట్లు తెలు పఁబడి యున్నది.

    శ్లోఆసీదమాశ్యరత్నం కాటయ వేమ ప్రభుస్తస్య
    అతిసురగురు భార్గవమతి గతి భార్గం విజయనీఖ్యాతి ||

    శ్లో. సింహాస నే సి ఛాయా సౌకుమారగిరి భూవరం
    ఆ తేజయమ్మహా తేజా శ్రీకృష్ణ ఇవ ధగ్మణం
    కుమారగిరి యానాధో యస్యైవిక్రమ తోషితః
    ప్రాదాత్ స్రాధీభువం రాజమహేంద్రనగర ముఖాం

    -. . ఈ శాసనము జయంత రామయ్య గారి వలన పత్రికలో ముదింపఁ బడినది.