పుట:Srinadhakavi-Jeevithamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

76


"శా. స్వామి ద్రోహర గండలాలను వసు - సుగ్రామ 'గాండీవికిన్
వేమక్ష్మాపతి కావ్య రారకల నిటలా విఖ్యాత ధీశక్తి కిన్ "
నామామాత్యుని కన్యరాజ నిలాతు భ్యాగ్యాక్షర:
స్తోమా పాకకరణ ప్రాణులకు మంత్రుల్సాటియే యెవ్వరున్
.”
ఉ., తమ్ములు దన్ను మువ్వురును దైవముగా గురుగా మహా విభా
సమ్ముగ దాతఁగా దమ మనంబులబుల భావన చేసే కొల్వ భా
గ్యమ్ముల కెల్ల నెల్లయము కాంచం ప్రసిద్ధి గృప ప్రధాన న
త్నమ్మగు మత్రి పెద్దన యుదాత్త మతిన్ రఘురాము కైవడిన్."


అన వేమమహీ పాలుని కాలమునఁ గూడ బాలసరస్వతి యను కవియు, సతని వెనుక ఆలోచనాచార్యుండను కవియు విద్యాధి కారులుగ నుండి శాసనముల లిఖింపుచుండిరి. మఱియు నతనిపరిపాలనమున ప్రకాశ భారతీయోగి యని యింకొక యంధ్ర కవీశ్వరుఁ డుండెనని యన వేముని ద్రాక్షా రామ దేవాలయమున వ్రాయించిన పద్యశాసన కృతులవలన, దెలియవచ్చు చున్నది.

కుమారగిరి వసంతభూపాలుఁడు

.

(శ్రీ. శ 1383 మొదలుకొని శ్రీ. శ 1400 నఱకు)

అన వేమభూపాలుని శాసనములు కీ. శ. 1383 వఱకుఁ గనం బడు చున్నవి. గావున నటుతరువాతనే అనపోత రెడ్డి కుమారుఁడగు క మారగిరి రెడ్డి రాజ్యభారమును సహించెను. ఇతనికి వసంతోత్సవముల యఁదున్న ప్రీతి రాజ్యాంగ వ్యవహారములపట్ల లేదని చెప్పఁదగును. ఇతఁడు తండ్రి తాతల వంటి ప్రజ్ఞావంతుఁడుగఁ గన్పట్ట్యడు. విద్వాంసుఁ డై విద్యా వ్యాసంగములఁ బొద్దుపుచ్చు వాఁడే గాని రాజ్యరతుణమునఁ ప్రమత్తుఁడై కనుమఱింగి యుండెను. కర్ణాట రాజ్యాధీశ్వరుండగు రెండ న హరిహర రాయలు సమకాలికుఁడై యుండెను. కర్ణాటయువ - రాజగు దేవ రాయ లుదయగిరి రాజ్యమున కాధిపత్యము వహించి యుదయగిరి నెల్లూరు దుర్గములలో నుండి రెడ్డి రాజ్యమును గ్రమముగ నాక్రమింప