పుట:Srinadhakavi-Jeevithamu.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అధ్యాయము 3.

విద్యాభ్యాసము—విద్యాసంపత్తి.

శ్రీనాధుని బాల్యమును గూర్చి మన కంతగాఁ దెలియరాదు. శ్రీనాథునితల్లిదండ్రులను గూర్చియు నేమియు ంర్ఱుంగరాదు. ఇతఁడు బాల్యమునం దెట్లు విహరించెనో విద్యాభ్యాస మెట్లు గావించెనో యదియుం దెలియ రాదు. ఇతఁడు తన కాశీఖండమున

 చిన్నా పొన్నారి చిఱుత కూకటినాఁడు
రచియిం చితి. మరుత్తరాట్చరిత్ర,
నూనూగు మీసాల నూత్నయవనమున
శాలివాహన సప్తశతినోడివితి

అనియును, మఱియును శృంగార నైషధ కావ్యమున:-

క. జగమునుతింపగఁ జెప్పితి ప్రెగడయ్యకు సాయముంగుఁ బెద్దనకు గృతుల్" నిగమార్థ సార సంగ్రోహ మగు నాయారాధ్య చరిత మాదిగ బెక్కుల్

అని తన విరచితములుగాఁ జెప్పుకొన్న మరుత్తరాట్చరిత్రములో గాని శాలివాహనస ప్తశతిలోగాని, పండితారాధ్య చరిత్రములో గాని మరి తదితర గ్రంథములలోఁ గాని యేమైన వివరముగాఁ జెప్పుకొని యుండు నేమోగానీ యాగ్రంథము లిపుడెచ్చటను గానరానందున నేమియుఁ తెలియ రాకున్నది. తాతయే శ్రీనాథునికి చిన్నటనాఁడు విద్యయు గవిత్వము నేర్పియండునని వీరేశలింగముగా రూహించి చెప్పునది సత్య మగునేని శ్రీనాథునివంటి మహాకవి ప్రఖ్యాతిగాంచిన తన యుత్తమ గ్రంథములలో తన పితామహుఁడై న కమలనాభుఁడె తనకు విద్యాగురు వని చెప్పుకొని యుండకమానఁడు.

 గీ. మత్పి తామహుఁ గవిపితామహునిఁ దలతు
గలిత కావ్యక శాలాభుఁ గమలనాభుం<poem>