పుట:Srinadhakavi-Jeevithamu.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయా ధ్యాయము


సంపాదించి పెదకోమటి వేమూరెడ్డి మరణ పర్యంతము సత్యంత ప్రతిభా నై పుణ్యములతో నిహ్వహించినది సుప్రసిద్ధమైన చరిత్రాంశము. పెద్ద కోమటి వేమారెడ్డి మరణాంతర మనఁగా నిరువది సంవత్సరపు కాములకుఁ బిమ్మట శ్రీనాథ మహాకవి కాంచీపురమునకు శిష్యుడును మఱియునగు దగ్గు పల్లి దగ్గనతోఁ బోయి తన్ను సందర్శించినప్పు డరువదియేండ్ల వయస్సు గడచిన వృద్ధుఁడు తిప్పయ సెట్టి మనకవిని బాలసఖుఁడని హెచ్చరించి జ్ఞప్తికిఁ దెచ్చుకొనుట యాశ్చర్యకరమైన విషయము గాదు. కావున హరవిలాస రచనాకాలము నాటికి శ్రీనాధునకు నలువది సంవత్సరములును, తిప్పయ సెట్టికి నరుపది యైదు సంవత్సరములకు మించిన సయస్సుండబోదు. కనుక మన శ్రీనాధమహావి క్రీ. శ.1380 దవ సంవత్సక ప్రాంతమున జనించి యుండవలయుననుట సత్యమున కంతదూరమున నుండునది కాదు. ఈకాలము శ్రీనాథుడు తన గ్రంధములలోఁ జెప్పుకొన్న విషయముల నన్నిటిని క్రమముగా సమన్వయించుటకు సరిపోవుచున్నది. నేను శ్రీనా థకవి జీవితము యొక్క ప్రథమ ముద్రణ గ్రంథమును జేసిన యీమావాద స్వభావమును జక్కఁగా నవగాహనముఁ జేసికొన్న శ్రీ ప్రభాకర శాస్త్రిగారు తరువాత తాము వ్రాసిన 'శృంగార శ్రీనాథ'ను ను గ్రంథమున శ్రీనాథుని జన్మ కాలంలమించుక యించుమించుగా క్రీ. శ.1385 అగు ననీ వ్రాసియున్నారు. కాని 1404 సంవత్సరము నాటికి పెదకోమటి వేమా రెడ్డి యాస్థానమున విద్యాధికారపదని యందుండి శ్రీనాథుఁడు శాసనాచార్యుడుగా నున్నట్టు గొన్పించుచున్నది. గావున నప్పటికి శ్రీనాధునికిఁ బదు నెనిమిది పదుతోమ్మిది సంవత్సరముల వయస్సు మా త్రమే యుండును. అప్పటికీ శ్రీనాథ మహాకవికి నిరువదినాలుగు యిరువడియైదు సంవత్సరములయిన వయస్సుండునని నాయభిప్రాయము, ఇందలి వివరణము చదువరులకు ముందు బోధపడఁగలదు.