పుట:Srinadhakavi-Jeevithamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాధ్యాయము

55

 
జంద్రచందన మందార సదృశ కీర్తి
సర ససాహిత్య సామ్రాజ్య చక పర్తి

అని కవిస్తుతి వర్ణనములో మాత్రము పక్కాణించి వర్ణించి యున్న వాఁడు గాని తనకు విద్యాగురువును జెప్పుకొని యుండ లేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారిచే కడప పట్టణమున నిర్వహింపఁబ డిన వార్షిక సభలో శ్రీనాగపూడి కుప్పుస్వామయ్య గారు శ్రీనాథుని కవి త్వమునుగూర్చి యుపన్య సించుచు నిట్లు నుడివియున్నారు. ఇతని గురువు 'ఘోడె రాయఁ డను బిరుదుగల భీమేశ్వరస్వామి యని కాశీఖం డము (ఆ .. ప 13)

ఆంధ్ర క్షమాముండ లాఖండలుండైన
వేమభూపతికృపా వీక్షణంబు
ఘోడె రాయాంక సద్గురు రాజభీమేశ్వ
రస్వామి పథసమారాధనంబు
కమలాదీనిలయ మార్కండేయశివమౌళి
చంద్రాంశునవసుధా సారధార
వేదాద్రినర సింహ విపులవక్షస్థలీ
కల్హరమాలికాగమాలికా గందలహరి
కారణంబులు నుద్బోధకములు గాఁగ
సంభవించిన సాహిత్య సౌష్ఠవమున
వీర భద్రేశ్వరుఁ బ్రబంధవిభుని జేసి
కాశీ కాఖండము 'దెనుంగుగా నొనర్తు.

.

అను పద్యమువలన "వేద్యంబయ్యెడును. “ఇచ్చట 'వేదాద్రి యను క్షేత్ర మేది యని యరయ బ్రహ్మశ్రీ సదాశివశాస్త్రి గారు, అవధానము శేషశాస్త్రి గారు వీరిచేఁ బ్రకటిత మైన వేంకటగిరి రాజుల వంశ చరిత్రలో 42వ ఫుటయందు, హైదరా బాదుసీమలో రాచకొండ యను దుర్గమునకు దక్షిణమున , వేదగిరి యని వ్యవహరింపఁబడుచున్న పర్వతముయొక్క గుహలో నరాహనార