పుట:Srinadhakavi-Jeevithamu.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
48
శ్రీనాథ కవి


తిప్పయ శెట్టి వానిని బాలసఖుఁడని గారవించి శైవమతగ్ధంథమును డెబ్బ దేండ్ల వయస్సునా డంకితము నొందె ననియుఁ జెప్పినది నాకంత విస్వాసపాతముగాఁ గన్పట్ట లేదు. వారి యభిప్రాయమును బట్టిగా 1390 వ సంవత్సరము నాఁడు పెగడయ్యకుఁ బండితారాధ్యము మొదలగు పెక్కు కృతులను నంకితము గావించెనుగదా! 1395వ సంవత్సర ప్రాంతమున నాతని తమ్ముఁడును 'పెదకోమటి వేముభూపాలుని మంత్రి యు నగు సింగనామాత్యునకు శృంగారనైషధకృతి సంకితము గావిం చెసుగదా! ఇట్లయిదు సంవత్సరముల కాలము. పెదకోమటి వేమభూ పాలునీ మంత్రుల నాశ్రయించి వారి ప్రాఫున గ్రంథరచననులో మునింగి యుండియు, ఆకాలమున ధనార్జనముసకై కుమారగిరి రెడ్డి మంత్రుల కడకుఁ బోయె ననియు, వారెవ్వరు నాతని నాదరించకపోఁగా ? : శైవమతాభిమానము చేత శైవుడైన శ్రీనాథున గారవించి మైత్రి నెరపి యూరక యామహకవిసత్తమునిఁ బంపి వేసి సిమ్మట మఱి పదిసంవత్స రములకు బాలసఖుఁడని ప్రేమించి హరవిలాసము కృతినొందె ననుట యెట్లు విశ్వాసార్హ మగును. మఱియును నీ రేశలింగ మగారు దుగ్గన శ్రీనాథుని కాలములో బాలకయై యాతని యనంతరముననే కాంచీపు రమహాత్మ్యముకు, నాచి కేతూ పాఖ్యానము జేసినట్టు కానంబడుచు న్నాఁడు' అని వ్రాసియుండుట గూడ నారు పైనచెప్పెడు నభి ప్రాయముల కు బాధకముగా నుండకపోదు. దుగ్గన శ్రీనాథుసకు మఱిఁదియు, శిష్యుఁడుగూఁడ నై యున్నాడు. శ్రీవీరేశలింగముగారు. శ్రీనాథుని జీవిత కాలములో నీతఁడు బాలకవిగా నుండెనని వచించుచున్నారు. శ్రీనాథుఁడు 1365.లోఁ బుట్టెననియు, నాచికేతూ పొఖ్యానము 1465 దుగ్గన రచించి యనంతామాత్య గంగయ్యకు నంకితము చేసెనని యుఁ జెప్పెడి వీరేశలింగము గారి యభిప్రాయములో శ్రీనాథుని జీవిత కాలములో దుగ్గన బాలకవిగా నుండెనను వాక్యాభిప్రాయమును సమ