పుట:Srinadhakavi-Jeevithamu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
47
ద్వితీయాధ్యాయము


లోనే రెడ్డి రాజ్యమునకుఁ బ్రధాన నగరమైన కొండవీటికిఁ బోయి కుమా రగిరి రెడ్డి యొక్క మంత్రులు మొదలగువారి నాశ్రయించి యుండును. యచ్చటి వారీతని కచ్చటఁ బ్రవేశము కలుగనీయ లేదు.” అని వ్రాసిరి ఇదెప్పుడు తటస్థమయ్యెను, వారి యభిప్రాయము ప్రకారము వారు చెప్పినరీతి నిరువదియై దేండ్ల బాలుఁడై యున్నప్పుడు గదా ! మఱియొక చోట (అటుతరువాత రెండుమూఁడేండ్ల కనఁగా 30 వ సంత్సర ప్రాంతమున శ్రీనాధున కిఱువదియై దేండ్లుండినప్పుడు పండితారాధ్యచరి త్రము రచింపఁబడి యుండు" నని వాక్రుచ్చియున్నారు. ఈపండితా రాధ్య చరిత్రము నైషధకృతిపతియైన సింగనామాత్యుని యన్నయును, దండాధీశుఁడు నైన ప్రగడన్నగంకితము చేయఁబడినది..ఈ విషయమై సింగనామాత్యుఁడు పలికినట్లుగా శృంగార నైషధమున

క. 'జగము నుతింపగఁ జెప్పెడి ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్ నిగ మార్ధసార సంగ్రహా మగు నాయారాద్య చరిత మాదిగ బెక్కుల్. ,

అని డృఢముగాఁ జెప్పియున్నాడు. దీనింబట్టి శ్రీనాథుఁడు తాము చె ప్పిన చొప్పున ఇరువదియై దేండ్ల ప్రాయమున దండనాథుఁడైన పిగడ న్న నాశ్రయించి పండి తారాధ్య చరిత్ర మాదిగాఁ బెక్కు గ్రంథములు రచించియుండగా ధనార్జనమునకై కొండవీటికిఁ బోయి కుమారగిరి రెడ్డి మంత్రుల నాశ్రయించినను బ్రవేశము లేదనియు, ఉభయలును శైవ మతస్థులగుట చేత తిప్పయ సెట్టికి నిరువదియై దేండ్ల బాలుఁడైన శ్రీనాథునకు మైత్రి కలిగినదని చెప్పుట సంభావ్యమగునా! ధనార్జనమునకై పోయిన వాఁడు, శైవమతాభిమానమువలన మైత్రి గావించుకొనిన తిప్ప యసెట్టి కప్పుడేమియు నంకితము చేసి ధనసంపాదనము చేయక చేతులు జాడించుకొనుచుఁ బోయె ననియు, మఱి ఫదియేండ్లకు వచ్చినప్పుడు