పుట:Srinadhakavi-Jeevithamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

ద్వీతి యూధ్యాయము


స్వయింప వలసి యుండును గదా ! సొచికేతూపాఖ్యాన రచనా కొలముసకు దుగ్గనకు నలువదియైదు సంవత్సరములున్న పను కొన్నను దుగ్గన 1425 వ సంవత్సరమునఁ బుట్టి యుండ నలయును గదా! శ్రీనాథుని యవసానకాలమునకు లక్ష్మణ రావు గారి యభిప్రాయము ప్రకార మా బాలకవియైన దుగ్గనకు 15 సంవత్సరము లును, వీరేశలింగము గారి యభి ప్రాయము ప్రకార మా బాలకవికి 35 సంవత్సరములు నుండి యుందును. దుగ్గనకంటె నతని తోబుట్టువు శ్రీనాథుని భార్యకు -90 సంవత్సరములు వయస్సులో నెచ్చుతగ్గులన్న వన కొన్నను 1405 దవ సంవత్సరమున నామె జనించి యుండవల యును. మఱి పదియేండ్లకనఁగా 1415 సంవత్సర ప్రాంతమున వివాహ మై యుండనలయును. అటుపిమ్మట మూడేండ్ల కుఁ గాని కాపురమునకు బోయి యుడడుగదా! అనఁగా శ్రీనాథునకు నేఁబది యేండ్లు దాటిన తరువాతనే వివాహమును, భార్య కాపురమునకు వచ్చియుండుటయుఁ దటస్థమై యుండవలయును గదా. శ్రీనాధుఁ డేబదేండ్లు దాటువఱకు ను వివాహము లేకుండ నున్నాఁడనుట నాకంత విశ్వాసపాత్రమైన విషయముగాఁ దోఁచలేదని యిదివఱకే తెలిపియున్నాఁడను. అట్లయిన వీరివాక్యముల నన్నిటిని సమన్వయించుట యెట్లు! హరవిలాస రచన కాలయును. మసము స్థిరీకరింపఁ గలిగిన యెడల మరము శ్రీనాథుని జన్మ కాల సమస్యను పరిష్కరింపఁ గలము.

హరవిలాస రచనా కాలనిర్ణయము,

హరవిలాసరచనము కొండవీడు పురమున గాక కొంచీపురమునజరిగినది. ప్రఖ్యాత విమర్శకులయిన లక్ష్మణ రావు గారు హరవిలాసకృతి యగు తిప్పయ పెట్టి తాత పావాణి సెట్టి,

 తే. సింహావిక్రమ పట్టణ శ్రేష్టుడైన
సెట్టిజగ జెట్టి పావాణి సెట్టి' విభుఁడు