పుట:Srinadhakavi-Jeevithamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శ్రీ నా థ కవి


రచించునాఁటికీ నాతనికి నలునదియై దేండ్లకంటే నెక్కువ వయస్సు గల దని చెప్ప రాదు. ఇతనికంటె నతని యప్పయగు శ్రీనాథుని భార్య 15 సంవత్సరములు పెద్దదనుకొన్నను నామెకు 20 సంవత్సరములు వయ స్సుండు సని చెప్పవచ్చును. ఆమెకు బదవయేఁట వివాహమయ్యె నని చెప్పక తప్పదుగదా. అనఁగా 1415 సంవత్సరము తరువాతనే శ్రీనా థునకు వివాహమై యుండు నని సిద్ధాంతము చేయవలసి వచ్చును.లక్ష్మ ణరావుగారి యభి ప్రాయమును బట్టి వివాహ మగునప్పటికీ శ్రీనాథున కు నేఁబదియై దేండ్ల ప్రాయమును, నీరేశలింగముగా రి యభిప్రాయమును బట్టి యేఁబదేండ్ల « ప్రాయమును, హరవిలాసమును బట్టి డెబ్బది యే డేండ్ల ప్రాయము నుండును సకలవిద్యాసనాథుఁ డైన శ్రీనాథుఁడు శ్రీ పెద కోమటి వేముభూ సొలుని యాస్థానంబున విద్యాధికార పదవీయందుం డియు, మహాభోగము లనుభవించుచుండియు సంతకాలము వఱకు వివా హము లేకయే యుండెనా?

ఇంతియగాక వెల్గోటివారి వంశములో బదవ తరము వాడైన సర్వజ్ఞ సింగమనాయని సందర్శింప శ్రీనాథ మహాకవి వాని యాస్థానము నకుఁ బోయెననియు నా ప్రభువునలన సమ్మానము నొందే శ్రీవీరేశలింగముగారు సత్యముని వ్రాయుచున్నారుగదా! అదెప్పుడు సంభవమయ్యెను. 1425 దవ సంవత్సరమని శ్రీ వీరేశలింగముగారు వ్రాసియున్నారు. అహహా! విఘ్నేశ్వరుని జేయఁబోయినఁ గోతియైన ట్లుగా వీరిసిద్ధాంత మపహాస్య భాజన సుగుచున్నదే. 1425 దవ సం వత్సరమునాటికి వీరు వక్కాణించిన పదవతరము సర్వజ్ఞ సింగమనాయ నికి నప్పటికీ 25 సంవత్సరముల పాయము గల దనుకొన్నను నాయన జన్మకాలము 1400 అగుచున్నది. కాని యేఁడవతరము వాఁ డైన సింగమనాయని పుత్రుఁడు రావుమాధవరావు క్రీ శ. 1427--1429 సంవత్సరములలో రాచకొండలో నివసింపుచు రాజ్య పాలన