పుట:Srinadhakavi-Jeevithamu.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
41
ద్వితీయాధ్యాయము


అనుపద్యములోఁ దెలుప బడినది. మఱియును, "ఇది శ్రీ మత్కమలనాభ పౌత్ర మారయమాత్యపుత్ర, కవి సార్వభౌము సకలవిద్యా సనాథ మహాకవీంద్రప్రసాద లబ్ధ కవితావిశేష దగ్గుబల్లి తిప్పనార్య ప్రియతనూజ దుగ్గన. నామధేయప్రణీతం బైన నాచి కేతూ పాఖ్యానం బను మహాప్రబంధబునందు” అను గద్యలోఁ దాను శ్రీనాథుని శిష్యుఁడైనట్లుగాఁ గూడఁ చెప్పుకొని యున్నాడు. ఇది మాధవవర్మ వంశోద్భవుడై గజపతుల పక్షమున నుదయగిరిదుర్గము నేలిన బసవ భూపాలునకు మంత్రియగు ననంతామాత్య గంగయ మంత్రికి నఁకితము గావింపబడియె! వీరేశలింగముగారు ఘంట సింగ య్య నంది మల్లయ్య' అను జంటకవులను గూర్చివ్రాసిన ఘట్టమున 1365 దప సంవత్సర ప్రాంతమున శ్రీనాథుని ముద్దుమఱిది యైన దుగ్గకవిచేత నాచి కేతూ పాఖ్యాన నాతని కంకితము చేయఁబడియె' సని చెప్పియున్నారు. ఇంతకు బూర్వము: దుగ్గకవిని గూర్చి వ్రాసిన ఘట్టమున ఆవఱకే కాంచీపుర మహాత్మ్యమును రచియించి తరువాతనే సౌచి కేతూ పాఖ్యానమును రచియించి యుండుటచేత నీకడపటిఫుస్త కము 1480 వ సంవత్సర ప్రాంతములయందు రచియింపఁబడి యుండు' నని పరస్పర విరుద్ధముగ వ్రాసియున్నారు. "మొదట వ్రాసిన యభిప్రా యములకంటెఁ గడపటటవ్రాసిన యభిప్రాయము లే సరియైనవిగా గ్రహిం పనలసిన దని తమ పీఠికలో వ్రాసియున్నారు గాపుసఁ గడపటి యభిప్రా యమైన 1465 దవ సంవత్సరమున నాచికేతూ పాఖ్యానమును గంగ యామాత్యున కంకితము చేయఁబడిన దమ సిద్ధాంతమునే విశ్వసింతము. పై పద్యమును బట్టి శ్రీనాథుఁ డప్పటికీ బ్రతికి యున్నట్టు గానంబడుచు న్నది. శ్రీనాథసుకవి కూఱిమి చేయు మఱిది” యని యుండుటచేత శ్రీనాథుఁ డప్పటికి స్వర్గస్థుడై యుండు సనుట సంభావ్య మైయుండు నా? శ్రీనాథుఁడు బతకి యుండినను బ్రదికియుండకపోయినను నాగ్రంథము