పుట:Srinadhakavi-Jeevithamu.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
45
ద్వితీయాధ్యాయము


ము చేయుచున్న ట్లితని భార్య యగు నాగాంబిక శాసనమువలన స్పష్ట ముఁగా దెలియుచున్నది. ఈ శాసనములో రావుమాధవరావు రాయ రావు బిరుదమును స్థిరీకరించినాడని వాకొనఁబడి యున్నది. మఱియును శాలివాహనశకము 1351 సౌమ్య సంవత్సర చైత్రమాసమున రావు మాధవరావు భార్య నాగాంబిక నాగసముద్రమను తటాకమును శాశ్వత ధరాభివృద్ధి కై ప్రతిష్ఠాపించె నని యాశాసనము ద్ఘోషించుచున్నది. [1]*ఎనిమిద తరరము: వాఁడైన రావుమాధవభూపాలుడు క్రీ.శ.1430 దవసఁ నత్స రప్రాంతముసఁ బరిపాలనము సేయుచుండఁగా బదవతరము సింగమునా యఁడు 1400 లో బుట్టి యిరువదియై దేండ్ల ప్రాయముననే సర్వజ్ఞుడై యెట్లు పరిసాలనము చేయుచు సకలవిధ్యాసనాధుఁడైన శ్రీనాథుని సమ్మానింపఁగలిగెనని యే గణితశాస్త్ర ప్రకారము లెక్కింపగలిగిరో, ఏదివ్యదృష్టి చేతఁ గని పెట్టఁగలిగిరో యూహింప నలవిగాక యున్నది. ఎనిమిదవ తరములోని పురుషుఁడు 1430 లోఁ బరిపాలించునప్పుడు పురుషుడు మఱి (కనీస మెంచి చూచినను) నలువది యేండ్లకుఁ దరువాత బరిపాలనము చేసి యుండవలెను.అట్లయిన యెడల పదవతరము వాడైన సర్వజ్ఞ సింగమనాయడు 1470వ సంవత్సరము ప్రాంతమున నుండవలయును గాని యంతకు లోపుగానుండి యుండెననుట యసంభవము, శ్రీనాథుఁడు పదవతరము సింగమ నాయని సభకుఁబోయి సమ్మానముఁ బొందినదీ వాస్తవమైన యెడల హరవిలాసమును బట్టి శ్రీనాథునకు వయస్సు 132 సంవత్సరము లగు చున్నది.పితామహుఁడగు కమలనాభామాత్యునకు 87 సంవత్సరము

లాయు విచ్చినప్పుడు వానిమనుమడైన శ్రీనాథునకు 132 సంవత్సర

  1. *వెల్గోటివారి వంశ చరిత్రములోని యనుబంధములో నున్న శాసనములు జూడుడు.