పుట:Srinadhakavi-Jeevithamu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30
శ్రీనాథకవి

మున విద్యారాజీవభవుఁడు' అని ప్రస్తుతించియుండెను. గనుక మారయ కమలనాభునివంటి విద్వాంసుఁడు గాకున్నను, బ్రాగ్నుడువిద్యా వంతుఁడు ననియే తలఁపదగియున్నాడు' అని ప్రభాకరశాస్త్రిగారు వ్రాసియున్నారు.*[1].


అధ్యాయము 2

శ్రీనాథుని జన్మకాలనిర్ణయము

ఇదివఱకు శ్రీనాథుని జన్మ కాలమును నిర్ణయించిన వారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకటలక్ష్మణ రావు గారును, శ్రీవీరేశలింగము గారునై యున్నారు.*[2] శ్రీనాథుని జన్మకాలము 1360 దవ సంవత్సర ప్రాంత మని వేంకటలక్మణరావు గారు నుడువుచున్నారు. వీరేశలింగ ముగారు లక్ష్మణరావు గారి వ్యాసమును బఠించిన మీదట వారి మార్గము ననుసరించి శ్రీనాథుని జన్మ కాలము 1368 దవ సంవత్సర ప్రాం తమని చెప్పిరి. అయినను లక్ష్మణ రావు గారి వాక్యములనే యున్నవి యున్నట్లుగా మాత్రము చెప్పియుండ లేదు. లక్ష్మణరావు గారు వివా దాస్పదములయిన వేఱువిషయముల నేమియు నెత్తక మెల్గగా జాఱి

విడిచి హరవిలాసకాలనిర్ణయమునకు మాత్రము పూనుకొని కొంతవఱ

  1. 1908 దన సంవత్సరమున వంకాయల కృష్ణస్వామి శ్రేష్ఠ గారి శ్రీరంగ విలాసము ద్రాక్షరశాలయందు ముద్రించి ప్రచురించబడిన ముద్రిత గ్రంధము నాకడ నున్నది. అందెక్కడను సూరయామాత్యుఁడు విద్యారాజీవభవుఁడని వర్ణింపఁబడిన పద్యము గాని పచనము గాని నాకంటఁబడలేదు. మఱి యే గ్రంథము నైననున్న శాస్త్రీ గారు మఱచి 'కాశీఖండ' మని ప్రస్తావించియుందు రేమో? ఏమో?
  2. *వీరిపుడు కీర్తిశేషులయినవారు. గ్రంధాలయ సర్వస్వము, ద్వితీయసంపుటము, ప్రధమసంచిక, శ్రీనాథుని గ్రంధముల కాలనిర్ణయమను వ్యాసము.