పుట:Srinadhakavi-Jeevithamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథ కవి


శాసనమువలనఁ దెలియుచున్నది. ఈ పూంగినాఁడే శబ్దార్ధ సంగతిని బట్టి పాకనాడు' కావచ్చు" నని కొందరభిప్రాయపడుచున్నారు గాని వేమా రెడ్డి శాసనమునకుఁ బూర్వము బహుశతాబ్దములనుండి పాకనాఁడ నునది వ్యవహారములోనున్నట్లు పై పద్య ప్రమాణముల వలనను శాసన ప్రమాణము వలనను దేటపడుచున్నది. అదియునుగాక పూంగినాఁడరు వది యొక వేల సంఖ్య యున్నట్లుగ నందును జెప్పఁబడి యుండ లేదు. 'పూం గినాటికంటే బహువిశాలతరమైన ప్రదేశమునకుమాత్రమె పాకనాఁడ ను షేరు చెల్లి యుండ వలయును. ఇచ్చట నీ చర్చయనావశ్యకమని విరమిం చుచున్నాను.

కృష్ణ వేణ్ణా నదికి దక్షిణ భాగము "కమ్మక కరాఠము" (కర్మక రాష్ట్రము) అని వ్యవహరింపఁ బడుచుండెడిది. చాళుక్యలను వేల్కు లముల వారు దండెత్తి వచ్చి యీమ దేశము నాక్రమించు కొని పరిపాలిం చిన నాట నుండి వేల్నాడనియు ఆఱు వేల సంఖ్యతో నొప్పు చుండెడిది గనుక నాకు వేల్నాడనియు, సంస్కృతమున షట్సహస్ర దేశమనియు ను వ్యవహారనామము గలిగియుండెను. ఇంతకుఁ బూర్వము కమ్మక రా ట' మను ప్రాచీన నామ ముండుట చేత "కమ్మనాఁడు” అని కూడ వ్య వహరింపఁ బడుచు, పాకనాటి కుత్ర భాగమునకు మాత్రమే గూఢ నామమై యొప్పుచుఁ దరువాత నాఱవేలనాటిలో సంతర్భాగమై ప్ర ఖ్యాతికివచ్చెను.

ఆరు వేలని యోగులను వారు 'మొదట ఆఱు వేలనాటిసీనులోనివసించిన వారగుటచేకాఱువేల నియోగులనియు పాకనాటి లో మొదట

  • పూర్వచాళుఖ్యుఁ డగు రాజరాజునరేంద్రుని కుమారుఁడగు కులోత్తుంగచక్ర వర్తి

కొంకి గొంక రాజ్జూ తనకు యుద్ధములో సహాయ చేసినందున పట్సహప్రావనీ మండ లాది పత్యము నొసం గేనని యొక శాసనములో నిట్లు చెప్పబడినది.

  • సంగ్రామ సాహాయ్యను శుష్టచిత్తాత్ శ్రీ రాజరాజు ప్రధనాత్మ సువీరః

యః షట్ససహ స్రావనీ మండలాధిపత్యం సమాసాద్య చిరంభునక్తి ."