పుట:Srinadhakavi-Jeevithamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

21


కొనుచుండవచ్చును. కాకతీయ చక్రవర్తు లాంధ్ర దేశమును శ్రీ. శ. 1324 వఱకును మహా వైభనముతోఁ బరిపాలించిరి. ఆకాలమున బాకనాడునుండి నియోగులు పెక్కుండ్రు కృష్ణ వేణ్ణా గోదావరీ మధ్యస్థ ఖండప్రదేశములకు మంత్రులుగనో, దండనాథులుగనో, మఱియు నిత రములగు రాజకీయోద్యోగముల మూలముననో వచ్చి యుండిరచుట చరిత్ర ప్రసిద్ధ విషయము.

వేల్నాడు. పాకనాడు


టెంకణాదిత్య కవితతకుమార సంభవము నందు :---

మ ఆవృపాల మౌళి దళితాంఘ్ర - యుగండయి పొక నాటీయ
దిరువది యొక్క వేయిటిక దీశుఁడు - జను చోడబల్ల కిం
జిరతర కీర్తి కగ్రమహిషి ........................
బర శశి రేఖయైన గుణ భాసిని శ్రీ సతి కిం దనూజుఁడన్,

అనియు, ఓపిరిసిద్ధి శాసనమున: ---

చ. బిరుదును కొన్న యా తెలుగు బిజ్జనకున్మండు మల్లిదేవుడమల్లె దేవుడ
చ్చెరు వగుచున్న పొత్తనయ చిన్నాగు వీడును వ్రాలి పాక నా
డిరువదియొక్క వేయి జన మేలుచుఁ బల్లవుండుఁగెల్చి త
త్కరివర సంభ మౌక్తిక వితాంతతఁ బుచ్చె నిలాసై పుత్రికన్

అనియు, ముంచెనకవి తన కేయూర బాహుహు చరిత్రము నందుః----

ము. ఆరుదఁందన్ వెల నాటి చోడమను జేంద్రాజ్ఞాపనం బూని దు
స్తరశక్తిన్ జని యేక వింశతి సహస్రగ్రామ సంఖ్యాక మై
ధరణిం చేర్చిన పాక నాడు నిజదోర్ద..... కలగ్నంనింబుగా
బరిపొలించె సమాక్యా కొమ్మక జగత్పఖ్యాత చారిత్రుండై.

అనియును వర్ణించి వక్కాణించిన పాక నాఁడు ఇరువది యొక్క వేలు సంఖ్య గల గ్రామములను గలిగియున్నట్టుగా దెలియుచున్నది, శ్రీ శైల పూర్వతట నికటమునుండి పూర్వ సముద్ర ముదాక ప్రవహిం చు కుండితరంగిణి యను గుండ్లకమ్మ (బ్రహ్మకుండి) నది కిరుప్రక్కల నుండు సీమకే పూంగినాఁడను నానుమున్నట్టి పోలయ వేమా రెడ్డి