పుట:Srinadhakavi-Jeevithamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

. ప్రథమాధ్యాయము

23


నివసించిన వారికి పాకనాటిని యోగులనియు నామ భేదములు గలిగినవిగాని వీఱందరు మొదట నొక్క శేఖవారే. వీరుభయులకు సంబంధ బాంధవ్యములు గలవు.

బెండపూడి అన్నామాత్యుఁడు తన్ను " పాకనాటింటి వాడవు బాంధవుఁడవు " అని అన్నట్లుగా శ్రీనాథుఁడు తన్నుభీమేశ్వర పురాణ మునఁ దెలుపుకొని యుండుటచేత కొందఱు శ్రీనాథునియింటి పేరు 'పాకనాటి వారని తలంచుచున్నారు.

నాచి కేవతోపాఖ్యాన విమర్శమునందు నామిత్రులగు శ్రీ టేకు మళ్ల అచ్యుతరావుగారు రెండు ధర్మసందేహములను వెళిపుచ్చిరి. అందు మొదటిది:-

“పాకనాటింటివాఁడవు బాంధవుఁడవు” అని బెండపూడి అన్నమంత్రి తో చెప్పినట్లు శ్రీనాథుఁడూ వాసికొనెను. * పాకనాటింటివాడవు అను వాక్యము పాకనాటి దేశస్థుఁడని యర్ధమిచ్చునని బ్ర శ్రీ. వేం. ప్రభా కరశాస్త్రి గారు వ్రాసినారు. ఇంటివాడవు అని చెప్పుటలో గృహనామ మని నేనూహించు చున్నాను." అనునది. ఇక రెండవడి: దుగ్గనకవి బహుశః ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు" అనివక్కాణించుట*[1]

అచ్యుత రావు గారి పై సంశయములకు శ్రీకుందూరి ఈశ్వరదత్తు గారీ క్రింది విధముసఁ బ్రత్యుత్తర మొసంగినారు . " ప్రాదాత్త్రిలింగ విషయే వేల్నాం విసీమని " " ప్రాదాత్త్రిలింగ విషయే వేల్నాడా పుణ్య సీనుని ”

శ్రీనాథుని చే వ్రాయబడిన "వేమా రెడ్డి శాసనములు,

" శ్రీనాధుఁడు తనభీమేశ్వరపు పుణమునందుఁ గృతిభర్త తన్ని

ట్లు సంబోధించినట్లు వ్రాసికొనెను:-

  1. * భారతీపత్రిక పుష్య మాసపత్రిక చూడుఁడు.