పుట:Srinadhakavi-Jeevithamu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
21
శ్రీనాథ కవినాగ్రంధము వెలువడిన వెనుక "ఆంధ్రవార్తా పత్రికలలో 'కొల్చట్టణ మేది? యను.టను గూర్చి పెక్కులు వాదోపవాదములు జరిగియున్నది. చర్చలో మఱిరెండు గ్రామనామములు బయలుపడినవి. అందొకటి కాళీపట్టణము; 'రెండవది కలపటము. సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులై యాంధ్రులకుఁ బూజ్యనీయులును నాకుఁ బరమమిత్రులును నై యిప్పుడు కీర్తి శేషులు నైన లక్ముణ రావు పంతులుగారొక ప్రాచీన శాసనములో కలుపట్టణ' మను పేరును గాంచి శ్రీనాథుని కాల్పట్టణ మదియే యని నిర్ణయించిరి. అట్లు శానసములోఁ బేర్కొనఁబడిన కలుపట్టణము' నేను కలపట' మను పేరుతో నొప్పుచున్నదని గుర్తించుచున్నారు. కపటము నరసాపుమునసు బందరునకు నడుమనున్నది. మఱికొంఱు నర సాపురమునుండి. బందరునకుఁ బోవు బాటలో ముత్యాలపల్లికి సంబల దీపికి సమీపమున నైదాఱు మైళ్ళ దూరములోనున్న కాళీపట్టణమని శ్రీనాథుఁడు ప్రశంసించి యుండునని వక్కాణించిరి. కాల్ శబ్దమునకు క్రొత్త, కృష్ణశబ్దములు దూరస్టములు. అర్ధములను బట్టి చెప్పుకొన వలసిన నగుచున్నవి. కలు, కాళీశబ్దములు మాత్ర మక్షరముల మార్పు కలవి. కనుక కాల్ శబములకు సమీపించియున్నవి. కలు, కాళీశబ్దము లను పద్యములో గుదుర్చుకొనుటకై కాల్ శబ్దముగా శ్రీనాథుఁడు మార్చుట కవిసంప్రదాయమునకు విరుద్ధము కాదు గాన మన మంగీక రింపవచ్చును. కలపటమా? కాళీపట్టణమా? అని మరలగలుగుచున్న దీ. లక్ష్మణ రావు గారి శాసనములోని కలుపట్టణ మే తరువాత కాళీ పట్టణమని వ్యవహరింపఁ బడుచున్న దేమో! లేక కలుపట్టసంశయము కలపటము

గ్రామము కంటెను కాళీపట్టణము యొక్క శిథిల స్వరూపము ప్రాచీన 

వైభనమును సూచించు చున్నది. ఇంతకన్న వివరముగాఁ దెలియునంత వఱకు కాళీ పట్టణ మునే కాల్పట్టముగా భావించు