పుట:Srinadhakavi-Jeevithamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాధ్యాయము

251

'శాంత బిక్షావృత్తి యుతీశ్వరును ప్రాభవమును విశేషముగా సభివర్ణించి యడుట చేతను శాంతబిక్షావృత్తి యతీశ్వరును గూడ నా కాలము: నందున్నాడనుట సత్యమునకు విరుద్దము గాదు. . ఈ కాలమున నీ దేశ మంతయు నొడ్డె రాజుల గజపతుల స్వాధీనమయ్యెను. తన్నాదరించు నాంద్ర ప్రభువులెవ్వరు లేకుండుటచే వార్ధక్యము ముంచుకొని వచ్చుచున్నను సంసార భారమును భరించుటకై గజపతికి సామంతుడగు నే గణదేవునో యాశ్రయించి గృష్ణా తీరమునందలి బొడ్డుపల్లెను గుత్తకు దీసికొని గుత్తపైకమును చెల్లింపలేక వారి వలన నానా విధ కష్టములను బొందినట్లాతేనిచే రచింపబడినదను నీక్రింది చాటు పద్యమువలన దెలియ గలదు.

సీ. కవిరాజు కంఠంబుఁ గౌగిలింనుగదా,
పురవీధి నెదు రెండు పొగడ దండ,
ఆంధ్రవ సైషధ కర్త యంఘ్రి యుగ్మంబున
దగిలియుండెను గదా నిగళ యుగము,
వీరభద్రారెడ్డి విద్యాంను ముంజేత
వియ్యమం దెను గదా వెదురు గొడియు,
సార్వ భౌముని భుజాస్కంద మెక్కెనుగదా
నగరివాకిట నుండునల్ల గుండు,

గీ. కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు దీనిపోయెఁ దిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేలి మోసపోతి
సెట్లు చెల్లింతు టంకంబు 'లేడునూర్లు,


వార్థక్యము పై బడిన తరువాత, తన్నాదరించిన మహారాజు నాశనము జెందుటయు, పరరాజుల నాశ్రయించియొక గ్రామమును గుత్తకుఁదీసికొనుటయు, చిర కాలము గంటముఁబట్టినహస్తముతో నాగలిబట్టుటయు, దురదృష్టవశమునఁ బండించిన పంటసంతను గృష్ణ వేణమ్మ వరదలతో ముంచెత్తి కొని పోవుటయు, పోగా