పుట:Srinadhakavi-Jeevithamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

శ్రీ నాథ కవి


మిగిలిన పంటలను బిలబిలాకులు దీనిపోవుటయు, గుత్త ధనము చెల్లింప లేక పోవుటయు, పర ప్రభువులు దయాదాక్షిణ్యములను విడిచి గౌర వమునైన పాటింపక పురవీధిలో నెదు రెండలో నిలువ బెట్టి కాళ్ళకు గదలకుండ సంకెళ్ళు దగిలించి నగరి వాకిటనుండు సల్లగుడును నొక దాని బుజము పైబెట్టించి బాధించిన విధనంతను వర్ణించి చెప్పిన పద్యము శ్రీనాథునిది కాదని చెప్పుటకు నోరు రాఁగలదా ? ఇట్టి కష్ట ముల పాల్పడిన వెనుక నే శ్రీనాథ ! విసార్వభౌముఁడు శ్రీ, శై లయాత్రకుఁ బోయి యచటి మఠాధిపతులతో మైతి గావించుకొని ధన సంపాదన కై వారల ప్రోత్సాహమున శివరాత్రి మాహాత్మ్య మను నీ గ్రంథము సత్యల్ప కాలములో త్వరితగతిని రచించి యుండుననుట వాస్తవనుని విశ్వసింపవచ్చును. ఇట్టి పరిభవమును బొందినవాడగుట చేతను, వార్ధక్యము పెరుగుచున్న వాఁడగుట చేతను, ఆవతారి కాదులు కొంత వఱకుఁ బేలవముగా నుండవచ్చును. కాని గ్రంథమును మున్మయు శాంతయ కంకికితము చేయ లేదనుటకు సప్రమాణములగు నాధారముల నెవ్వరును జూపింప లేదు. శిథిలాతి శిథిలమగు ప్రతియొక్కటియె పరిషత్తు వారికి లభించటచేతను గ్రంథపాతములు పెక్కులు గాన పచ్చుచుండుట చేతను, ఇట్టి యపోహల కవకాశమిచ్చుచున్న దిగానీ గ్రంధమును బండిత వర్యులు నిష్పక్ష పాత బుద్ధితోడను, సత్యైక దృష్టి తోడను జక్కగా విమర్శించి కవిహృదయానుసారముగ నౌచిత్యభంగ ము లేకుండ నుచితసంస్కరణములను గావించి ప్రచురింపవలసిన గ్రం థమై యున్నది. ఇట్టిపని యాంధ్ర పరిషత్తువారి చేతను 'నెఱువేర్పఁబడి వలసి యున్నది.


శివరాత్రి చూహాత్మ్యమున కృతిభర్త తల్లియైన' యొమ్మ మాంబను వర్ణించిన యీక్రింది.--