పుట:Srinadhakavi-Jeevithamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

శ్రీనాథకవి


యవతరింపఁ జేసిననియుఁ బ్రచారము పుట్టించుచున్నారు. ఆవతారికా భాగము దోషభూయిష్టమై, అప్రౌడకల్పనాజల్సాకమై యుండుట కొరణమట. ఇంతమాత్రమునఁ బ్రబల ప్రమాణముఁ జూపించు సంత వఱకిట్టి వాదము నంగీకరింపరాదు, శ్రీనాథక విసార్వభౌముఁడు తన వార్ధక్యదశ యందు శివరాత్రి పర్వ కాలమున కృతిభర్త యగు " శాంతయ ప్రోత్సహించి నందువలనఁ ద్వరితగతిన గ్రంథమును రచించి నట్లు మనమూహింపవచ్చును గానీ తదితరములయిన యూహల కవ కాశము గన్పట్టదు. అవ తారీకాభాగముదోష భూయిష్టమై యుండు టకుఁ గారణము పరిషత్తునకు లభించిన ప్రతి శిథిలాతి శిథిలమై యుండుటయే కారణము, శాంత బిక్షవృత్తి యతీశ్వరుడు శ్రీ నాధునకుసమకాలికుఁడని నిస్సంశయముగాఁ జెప్పుడగును కృతిపతి యునుశాంతయ జంగమదేవర శాంత బిక్షావృత్తి యతీశ్వరునకు మూలభృత్యుడని శివరాత్రి మహాత్మ్యముసఁ జెప్పబడియున్నది. కనుక ముమ్మయ శాంతయ్య శ్రీశైల మందలి బీక్షావృత్తి మఠస్థ జంగముడని తేటవడఁగలడు. హరిశ్చంద్య చరిత్రను ద్విపద కావ్యముగా రచిం చిన గౌరన ముహాకవి తన పెదతండ్రి పోత రాజు దేవరకొండ రాజ్యాధి పతి యగు సింగన మాధవక్షితిపతిపాలమణికి మంత్రిగానుండెనని చెప్పి యుండుట చేతను, సింగన మాధవభూపాలుడు క్రీ.శ. 1423 లో రామాయణమునకు వ్యాఖ్య రచించినాఁడని వీని భార్యయగు నాగాంబిక 'రాచకొండ కుత్తరమున నాగసముద్ర మను తటాకమును ద్రవ్వించి వ్రాయించిన శిలాశాసనములో నుండుట చేతను, గౌరన తన నవనాథ చరిత్ర పీఠికలో శాంత బిక్షావృత్తి యతీశ్వరుని విశేషముగా నభివర్ణించి యుండుట చేతను1430 ప్రాంతములనున్న పోతన మంత్రి తమ్ముని కుమారుడైనజన గౌరనకవి 1440 ప్రాంతములనుండుట సత్వ మునకు విరుద్ధము కాకుండ చేతను గౌరన నవనాథ చరిత్ర పీఠికలో