పుట:Srinadhakavi-Jeevithamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

175


పుత్రుడు పుట్టెను. అతనికిఁ జోళ చేర పాండ్య రాజులు శిష్యులై ఢక్కా వాద్యాదిసమ్మానముల బహూకరించి.. ఆతని మునిమురుమఁడే భాస్క. రార్యుండు. ఈతఁడు ప్రసన్న కావ్యకర్త. ఇతని వంశమున "త్యాగ రా జననతఁడు పుట్టి కామకోటి పీఠమున విద్యా జయ స్తంభమును స్థాపించి నాడు. ఇతనికి స్వయంభూయజ, గురుస్వామి బుధుఁడు నజనుదయించిరి. ఇతర వంశములందు నిట్లే పల్వురు ప్రఖ్యాతవిద్వాంసు లుదయించిరి. ఇట్లు క్రమముగా వీర లేక వింశతివంశములవారయిరి. స్వయంభూ యజ్వకు సభాపతి యను కుమారుఁడను, గురుస్వామి బుధునకు సోమ నామథుడను కుమారుడును, అభిరామాంబిక యను కూతురు జనియిం చిరి. అభిరామాంబికను గౌతమడగు రాజనాథుఁడు పెండ్లి చేసికొనియెను. ఆయభి రామాంబిక పుష్పవతి కాక పూర్వము పదమూఁడవ సంవత్సర ప్రాయమున 'అరుణగిరినాధు' డను కుమారుని గనియెను. కుమారున కుపనయనము కాక పూర్వమే తండ్రి రాజనాథుఁడు శివసాయుజ్యమును బొందెను.

అభిరామాంబిక తనకుమారుని సోమనాధ మఖియను తనసోదరున కప్పగించి సహగమనము గావించెను. సోమనాథముఖ మేనల్లునిఁదనకొ డుకుల కంటె మొక్కువ ప్రేమతోఁ బోషింపుచుండెను. అరుణగిరినాధుఁడు వేదాధ్యయనము సేయుచునుండ నేమి కారణము చేతనో మేనమామ భార్యకీతనియెడ నసూయపుట్టి క్రోధముతో "మెలఁగుచుండెను. ఈవిష యమును మేనమామకుఁ దెలియకుండెను. అరుణగిరినాధుఁడీ బాధపడ లేక యొక నాఁడిల్లు విడిచి నవగ్రామము చేరి యక్కడ నొకశివాలయమున శివ సాన్ని థ్యమున శివునా రాధించుచుండెను. అంతటసోమనాథమఖ మేన ల్లునిఁ గానక యూళ్లునాళ్లు వెదుక మనుష్యులను బంపించెను. కానిమూ డవనాటి యుదయమున నదీతీరమున నా బాలునిఁ దమ్మయుమ్మి చే 'నెర్ర, బారిన పెదవితో గానంబడఁగాఁజూచి సోమనాధమఖ మేనల్లునిఁ గౌగ