పుట:Srinadhakavi-Jeevithamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179

శ్రీనాథకవి


లించుకొని నాయనా! ఇదియేమిరా యిట్లుంటి వనిప్రశ్నించెను.అంత నతఁడు 'మామా!' ఊరకవచ్చితిని, బడలికచే నీశ్వరాలయమున నిద్రించి తిని అర్దేందుశేఖరుఁడు నాకు ప్రత్యక్షమై నన్ను నిద్రనుండి మేల్కొల్పి విదాస్వభావమునఁ 'దేఱిపిగా నున్న నానోర డమ్మనుమిసెను; అందు చేనానో రెజ్జ వారి యున్నది. పరిశుభ్రము చేసికొనుటకై నేనిచ్చటికీ వచ్చితి" ననిపలికేనట. అప్పుడాతఁడు శివుని ననేక స్తోత్రములను రచియించెను. ఇతఁడే క్రొత్తగాఁ ఒట్టాభిషిక్తుఁడయిన ప్రౌఢ దేవరాయల వారినిదన కవిత్వశక్తి చేతను, వివాదచాతుర్యముచేతను మెప్పించి యాకవిమన్ననకుఁ బాత్రుడయ్యెను. ఈతఁడుకు ప్రౌఢ దేవ రాయుఁడునుతుల్యాంబ భరణధారులై యేకమనస్కులయి వర్దిల్లుచుండెవారట.ఇతఁడు యజ్ఞంబికయను కన్యను వివాహమై యనేక యజ్ఞములను గావించెను. ఔదుఁబరపురమునకుఁ దూర్పుగానున్న,తల్ప గ్రామమునకు దక్షిణముగాను, ననగ్రామమునకు వాయవ్యముగాను ప్రౌఢ దేవరాయలవారొక యారామమును నిర్మింపనయ్యది తూర్పు పడమరల కొక క్రోసును,ఉత్తరదక్షిణ ములకొక యకక్రోసుకు వ్యాపించి యనేక ఫలపుష్పాదులతోను, నాగవల్లీక్షు ఖండాదులతోను 'బెంపొందుచుండెను. రాయలాయారామమునకు 'నీలగిరి' యను పేరుగల యొక బేరిని నధికారిగా నియోగించేనట. ఈయారామమునుజూచి వాని గారాము రాణి యగు రుక్మిణీరామాలలామ దానిప్రమదోద్యానముగాఁ గైకొనియుండ నారామజీవి యగు నీలగిరి ధనాధికుఁ డై గర్వితుఁడై యుండెనఁట. అరుణగిరినాధుని పమలాయరామములోని కనవునకలవాటు పడియెనఁట. నీలగిరి వానిని నావలకుఁ దోలించుచుండెడివాఁడు. ఒకనాఁడు నీలగిరికోపముతో పసులురేపటినుండి తోటకు మరల వచ్చె నేనిఁ గట్టి పెట్టించెద, వాని విడిపించుకోదలఁచితీ లేని దక్షిణాధీశుఁడగు దేవరాయల యుత్తరువు నొందవలసినదెయనిగద్దించిపలి కెనట. మఱునాఁడు ఫసు లెప్పటి యట్లేయరిగెను. నీలగిరి