పుట:Srinadhakavi-Jeevithamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

శ్రీనాథకవి

చేయుట సుసాధ్యమే. ఆంధ్రకవి చరిత్రకారుడు తనకింతచరిత్రజ్ఞాన మును కలిగించి నందులకు కనకాభి షేక గ్రంథమునకుఁ గృతజ్ఞ తజూపి యుండనలయును. ఇప్పటి చరిత్ర గ్రంథముల నన్నిటిని జదివియు శ్రీవీరే శలింగము గారింకను సుప్రసిద్ధములైన చరిత్రాంశములను సయితముఁ తెలిసికొనఁ జాలక మమమని గొడుకునిజేసి చదువరులకుఁ దమ యపూర్వచరిత్ర జ్ఞానమును బోధించు చునే యున్నారని తెలుపుటకు విచార మగుచున్నది. బ్రౌఢ దేవరాయఁడు విజయబుక్క రాయల కొడు కై యుండఁగా విజయబు బుక్కరాయని తండ్రియైన దేవరాయని కొడుకై నట్లుగా వ్రాయుచున్నారు. రామకృష్ణకవిగారు శ్రీనాథకవితో వాదము జరిపిన డిండిమభట్టును గుర్తింప లేకుంకుట వింతకాదు గాని సుప్రసిద్ధమైన చరితాంశమై కన్నులకు విస్పష్టముగా గోచరమగుచున్న దేవరాయని కిని ప్రౌ దేవరాయనికిని గలసంబంధము నాంధ్రకవి చరిత్రకారుఁడు గుర్తింపలేకుండుట వింతగానే గన్పట్టక మానదు.

డిండిమవంశ్యుల పూర్వచరిత

ఒకప్పుడు కొంచీపురమునే చోళ రాజు . ". కాశీయాత) బయలు దేరి గంగావిశ్వేశ్వరుల సందర్శించి కాంచీపురమున నొక శివాలయ మును బ్రతిష్ఠంభనిశ్చయించి, ప్రాసానవల్ల భయజ్వ, భౌస్కరకవి, రాజ నాథకవి, సుబ్రహ్మణ్యకవి, జటాధ రేశయజ్వ, నీలకంఠకవి, సోమనాథ దీక్షితుఁడు, మల్లి కార్జునభట్టు నను. నెనమండ్రు గంగాతీరస్థు లయిన బ్రాహ్మణులను వారికుటుంబములతోడ నేంటఁగొని కాంచీపురమునకు మరలివచ్చెను. తరువాత నారాజు తుండీరమండలమునఁ దల్పగిరికి పశ్చిమభాగమున నొక యగ్రహారము నొసంగీ వారల నందుఁ బ్రవేశ పెట్టెను. వార లాయగ్రహారమున శివునిఁ బ్రతిష్ఠించి రాజనాథు డని పేరు పెట్టి యా దేవుని నింటి వేల్పుగాఁ జేసికొని యా రాధించుచు నందు నివసించియుండిరి. అటుపిమ్మట ప్రాసాదవల్ల భయజ్వకు సభాపతీయను