పుట:Srinadhakavi-Jeevithamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

137


బాల్యముననే వ్రాసియుండును గాని యాతప్పుల తఃక వాగ్గకదశ యందు నల్లి యుండడు."

శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర సంపూర్ణ గ్రంధమెచ్చటకు గానరాదని నేను వ్రా యుటచేత వీకేశలింగముగారు పల్నాటివీరచరి త్రమునందలి బాలునికధ మాత్రము వ్రాసెనని చెప్పినారు. పందొ మ్మిదేండ్ల ప్రాయమున నిల్లువిడిచి పెట్టనివాడు సముద్ర తీరమునఁ గొత్త పట్టణములోఁ గూరుచుండి శ్రీనాథుడు పల్నాటి వీరుల కులము వారి ప్రోత్సాహము చేత రచించినాడు . పల్నాటి వీరుల కులమఁట! పల్నా టి వీరులలో క్షత్రియులు, గొల్లల్లు, రెడ్లు' పద్మనాయక వెలమలు, మాలలు, మాదిగలు కులముల వా రెందఱొ కలరు. పల్నాటి వీరుల కులమువారన్న నాకర్థమగుచుండ లేదు. పల్నాటియనుభవము లేని పిన్నవాడు పల్నా టివీరచరిత మెట్లు వ్రాయఁ గలిగెనో యూహింపనలవిగాక యున్నది. కంటిరా యీచిత్రము ఈపందొమ్మి దేండ్ల పిన్న పొఁడు గ్రంథారంభ మునను గ్రంథాంతమునను నేమనుచున్నాఁడో యొక్క మాఱు చిత్త గింపుఁడు. గ్రంథాదిని.

సంగీత సాహిత్య చాతుగ్య కివిత
జెప్ప నేర్చినవాఁడఁ డెలఁగి మాచెర్ల
చెన్నరాయని పాదసేవారతుండ
పలను భారద్వాజవంశ వర్ధనుడ
గవిసార్వభౌమడ ఘనతగన్నట్టి
శ్రీనాధుఁడను వాడ శివభక్తి పరుండ,

అనియును గ్రంథాంతమున

“ఘనుఁ డైన శ్రీనాథకవిరాజరాజు
చెన్నుని కృపచేతఁ జిత్తముప్పొంగి
బాలుని విక్రమ ప్రౌడియంతయును
వివరించె జనులకు విశదమౌ రీతి,

18