పుట:Srinadhakavi-Jeevithamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

చతుర్థాధ్యాయము


అని వాయఁబడియున్నదే. ఆహా! ఇది యెట్టివిపరీతసిద్దాంతము! క్రీ. శ. 1526వ సంవత్సర ప్రాంతమున శ్రీనాథుఁడు కర్ణాటరాజధానికిఁ బోయి ప్రౌఢదేవరాయల యస్థానంబున గవిసార్వభౌమ బిరుదనాంచు డైన గౌడడిండిమభట్టుతోడ సుద్భటవివాదమును బెట్టుకోని వాని నోడించి యాదేవరాయమహా రాయల ముత్యాలశాలలో కనకాభి షేకమహోత్సవమును గాంచినది మొదలుకొని కవిసార్వభౌమ బిరుదముతోఁ బ్రవరిల్లుచుండెనని వ్రాసిన శ్రీవీరేశ లింగముగారు 1384 వ సంవత్సరమున శ్రీ నాధుడు తన పందొమ్మిదవ యేఁటనే కవి ర్వభౌమ బిరుదాంచితుఁడై పల్నాటి వీరచరితమగు తప్పుల తడికను రచించెనని వ్రాయుట హాస్యాస్పష మగుచుండ లేదా? 1420 అందవ సంవ త్సరము నాటికే యోరుగంటిపురములోఁ బల్నాటి వీరచరితము పాడు చున్నారు గనుక నంతకుఁ బూర్వమే పల్నాటి వీరచరతమును శ్రీనా థుఁడు రచించినాఁడని యొక హేతువు. ఆ పాడుచున్న ద్విపద ప్రబంధ ము శ్రీనాధుని దనుటకు హేతువు లెవ్వి! కొండన మల్లన యనువార లుకూడ ద్వీపదలలో బల్నాటి వీర చరిత్రమును జెప్పి యుండ లేదా? అట్టివారు మఱికొందరు చెప్పియుండ రాదా? ఆ పాడునది. శ్రీనాథుఁడు చెప్పిన ద్విపద కావ్యమేయని యెక్కడ చెప్పఁబడినది! ఇదియంతయు నేలవిడిచి సాము చేయుట వంటిది. కాఁబట్టి పల్నాటి వీరచరితము తప్పుల తడిక గావున బాల్యములో రచించి యుండుసని యూహచేసినది

హాస్యాస్పదమైన సిద్ధాంతమునకు మూల మయ్యెను."*[1]


  1. *ఉమాకాంతము గారు సల్నాటి వీర చరితమున శ్రీ నాథుఁడు వార్ధక దశయందు వ్రాసె నని వ్రాయుచున్నారు గాని నిక్కము"గా నాత డాచకతమును వచించియుం డ"నేని బాల్యముననే వాసియుండును గాని భూతప్పులతడిక వార్ధక దళియుడన సల్లియుండఁడని నేను వ్రాసినదాని భావమును సరిగా గ్రహింపక బాల్యమను పదమును మాత్రము పట్టుకోని విడువక పూర్వాపరం చర్భములను గమనింపక పోయిరి. ఏపల్నాటి వీర చరితమును శ్రీనాథకృతమని వ్యవహరించుచు వ్రాచున్నారో అది శ్రీ సాథకృతము కాదని నాయభిప్రాయము.