పుట:Srinadhakavi-Jeevithamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


తములుడు నల్లభరాయనిచే రచియంపఁబడిన క్రీడాభిరామమునం దిట్లు చెప్పబడినది. -

గీ. ..విప్రు, డీక్షించెఁ బలనాటి వీరపురుష
పరమదైవత శీనలింగభవనవాటి,

మ. ద్రుత తాళంబున......
యతిగూడం ద్విపద ప్రబంధమున మీ జానీకముం 'బాడే నొ
ప్రత్యేకముగాఁ గుమారికులు బీట్కారంబునతూలగన్.

గీ......పడతి పల్నాటి వీరుల బాడునవుడు.”

ఈ పుస్తకమువలన గలిగిన ప్రోత్సాహమునుబట్టి శ్రీనాథుఁడు గొప్పవానికిఁ గృతులిచ్చి ధనార్జనము చేయవచ్చు నన్న యాశగలవాఁడై స్వ! గామముకు విడిచి స్వస్థలమునకు మిక్కిలి సమీపమున నున్న యొక చిన్న సంస్థానమునకుఁ బోయెను. ఆ సంస్థానమున కప్పుడధిపతి పెదకోమటి వేముకు.

శ్రీవీ రేశలింగము గారిచేతగంతు తడిక నల్లించినది యాంధ్రు చరిత్రము మూఁడవభాగములో నాయీవాక్యములై యున్నవి.“ప్లల్నాటివీరచరిత్రమును శ్రీనాథుఁడు రచించెనని చెప్పెదరు కాని శ్రీనాథవిరచితమైన పల్నాటివీరచరిత్రము యొక్క.. సంపూర్ణ గ్రంథమేచ్చటను గాన రాదు. చెన్నపురి ప్రాచ్య లిఖంతపుస్తక భాండాగారమున శ్రీనాథవిరచితమని వ్రాయబడిన పల్నాటి వీర చరిత్రముబోని యొక భాగము మాత్రము గన్పట్టుచున్నది. ఆ భాగమైనను శ్రీనాథ విరచిత మనీ విశ్వసించుటకుఁ బ్రతిబంధకములుచాలఁ గలవు. శ్రీయుతులైన ఉమాకాంతముగాకు ప్రచురించిన పల్నాటి వీరచరిత భాగము శ్రీనాథ కవి రచితము కాదని తోఁచుచున్నది. ఉమాకాంతముగారు పల్నాటి వీరచరిత్రమును శ్రీనాథుఁడు వార్డకదశయం కు వ్రాసెనని వ్రాయు చున్నారు గాని నిక్కముగా నాతండా చరితమును రచించియుండు నేని