పుట:Srinadhakavi-Jeevithamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

135


యు నచ్చటనే గడపెను. పల్నాటివీరచరిత్ర మచ్చటనుండియే వ్రాసి నాఁడు. కాళీఖండము తరువాత నితడు రచిండి నది హరవిలాసము హరవిలాసము తరువాత నితఁడు రచించినది పల్నాటి వీర చరిత్రము వీరచ రిశ్రమ యొక్క పార్వాపర్యము తెలిసికొనుట 'కాగ్రంథమున నాధార ములు గన్పట్టుచున్నవి. బాలచం ద్రుని యుద్ధ ఘట్టమున; —

ద్వి. ఎసఁగెడు శివకంచి యే కామపతికి
జిఱు తొండ భక్తుఁడు చెలఁగు మాతండ్రి
పెంక లసిరుపను చెలువమాతల్లి
సిరియాళుఁడనఁబుట్టి చెన్నొందినాడ.

అని తన హరవిలాసములోని చిరుతొండనంబి కథను సూచించియున్నాడు. గనుకఁ బల్నా టివీరచరిత్రమే యికఁడు రచించిన గ్రంథములలో 'నెల్ల జివర గ్రంథమని చెప్పవలయు "దీనికిఁ బ్రతిపక్ష వాదముగా శ్రీవీరేశలింగముగారు నూతనముగాఁ బ్రచురింపించిన కవుల చరిత్రములో నిట్లు వ్రాసియున్నారు.“కాఁబట్టి నురుత్త రాట్చరిత్రము 133 వ సంవత్సర ప్రాంతమునరచించెనని చెప్పవచ్చును. నాకీ పుస్తకము లభింపనందున శైలియెట్లున్నదో యందు వ్యాకరణాది దోషము లేమయిన నుండినవో యది యెవ్వరికైననంకితము చేయఁబడినదో లేదో చెప్పఁజాలను, ఈతఁడు చేసిన రెండవ గ్రంథము పల్నాటివీరచరిత్రము నందలి బాలునికథ. ఇదియు నింటికడనున్నప్పుడే (కొత్త పట్టణము.లో) స్వగ్రామము నందలిపల్నాటివీరుల కులమువారి ప్రోత్సాహముచేత రచియింపఁబడి యుండును. ఈపుస్తక రచనమువలన శ్రీనాథునకుఁ గొంతధనలాభము గలింయుండును. పల్నాటి వీరచరిత్రము ద్విపద కావ్యము. ఇది 1384 వ సరివత్సర ప్రాంతములయందు రచియింపఁబడి యుండును. పల్నాటివీరులచరిత్ర ద్విపద నోరుగంటి పురములో ' నాడినట్లు 1420వ సంవత్సర ప్రాం