పుట:Srinadhakavi-Jeevithamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

భర్తయై యుండెను. "కాటయ వేముని మేనమామయగు అనపోతభూపా ar(ను ఈ అల్లాడి రెడ్డి భార్య వేమాంబతల్లికిఁ బెదతండ్రియై యుండిను. అనఁగా కాటయ వేముఁడును, ఆల్లాడ రెడ్డి భార్య వేమాంబ తల్లియును మేనత్త మేనమామ బిడ్డలగుదురు. ఇట్టి సంబంధ బాంధవ్యము చేత అల్లా డరెడ్డి కాటయ వేముని పక్షముననుండి పెదకోమటి వేమభూపాలునికి బ్రత్యర్థిగఁ బనిచేసెను. కుమారగిరి యనంతర మక్రమముగాఁ "బెనకోమటి వేమభూ పాలుఁడు కొండవీటి రాజ్యము నాక్రమించెను గోవునఁ గాట యవేమా రెడ్డియును, అల్లాడ రెడ్డీయును న్యాయములుకే పోరాడి యుందురు. కాని యీవిరోధముల వలన రెడ్డి సామ్రాజ్యము యొక్క యున్నతికి భంగము కలిగించెను. పెదకోమటి వేమునికంటె నైదుసంవ త్సరములు ముందుగానే అనగా 1415 వ సంవత్సర ప్రాంతమునఁ గాటయ వేముఁడు మృతినొందెరు. అతఁడు మృతినొందినను అతనిసంతా నము పక్షమున గల్లాడ రెడ్డి పెదకోమటి వేమునితోఁ బోరాడిజయించెను. పెడకోమటి వేముఁడు 1420 దవ సంవత్సర ప్రాంతమున మృతినొంది యుండును. ఈతని తరువాత నీతనికుమారుఁడు రాచవేమన రాజ్యభార మును సహించి నాలుగుసంవత్సరములు పరిపాలనము చేసెను గాని యి తఁడు తన దుష్ప్రవర్తనము చేతఁ దండ్రికి నపయశస్సు గలిగించుటయు గాక తన ప్రాణములను గూడఁ గోలుపోయెను. వీనితరువాత రాజ్యమంతయును గర్ణాటాధీశ్వరుల స్వాధీనమాయెను. శ్రీనాథుఁడు గార...20 నజకుఁ గొండవీటి నగరమున నున్న వాఁడనుట విస్పష్టము.

పల్నాటి చరిత్ర రచనా కాలము.

శ్రీనాథుని పల్నాటి వీరచరత్రమని యొక భాగమును బ్రచురించిన శ్రీ అక్కిరాజు ఉమాకాంతముగారు పీఠిక లో నిట్లు వ్రాసియున్నారు. “ప్రథమమున గౌరవము పడయకపోయినను రానురాను శ్రీనాథుఁడు పల్నాటి వారితో మిక్కిలి మైత్రి పాటించి తన వార్ధక్యము సంత