పుట:Srinadhakavi-Jeevithamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

133

033

పెడకోమటి వేముని యంత్యదశ.

పెదకోమటి వేమభూపాలుని పరిపాలనము సర్వవిధముల చేత శ్లాఘా పాత్రమైనదిగా నున్నది. అతఁడు మిక్కిలి సమర్థుఁడు. ప్రజ్ఞావం శుఁడు. అతనిమంత్రు లెల్లరును ప్రజ్ఞానంతులు. బాహుబలవిక్ర మసంప త్తికలవాడగుటచేత శత్రురాజు లెవ్వ రెన్ని విధములఁ దనరాజ్య నాక్ర మీంచుకొనవలయునని ప్రయత్నించినను వారలను బరాజతులను గావించి నైపుణ్యముమీర జనరంజకముగా ధరాసాలనంబు గావించెను. క్రొత్త సుంకములను వేయక ప్రాతపద్ధతునే బలపఱచి సుంకములు రాఁబ ట్టుచుండెను. సర్ణాశ్రమధర్మములను బోషించెను. వేదాధ్యయన సంప న్నులును శాస్త్ర వేత్తలునగు బ్రాహ్మణోత్త ములకు భూదానములు మొదలగునవి చేసి సత్కరించుచు సమస్త విద్యలను బోషింపుచుండెను. దేశమున వర్తక వ్యాపార మభివృద్ధియగు మార్గములను వెదకుచుండెను. బావులను చెఱువులను త్రవ్వించి వ్యవసాయకులకు నుపకారము గావిం పుచుండెను. దేశమున ననేక మతప్రతిష్ఠాపనములను గావించెను. ఈతఁడు 1420 వఱకుఁ బరిపాలనము చేసినట్లు గానంబడుచున్నది. కుమార గిరి రెడ్డి మరణానంతరము పెదకోమటి వేమభూ పాలునిఁ దిరస్కరించి 'కాట యవేముఁడు రాజమహేందపుర రాజ్యమును స్వతంత్రుడైపరిపాలనము చేసెను. అందువలనఁ బెదకోమటి వేమభూపాలునకును, కాటయ వేమభూ పాలునకును మనస్పర్ధ లేర్పడి యొండొరుల రాజ్యము లాక్ర మిం చుకొనుటకై యుద్ధములగూడఁ జరుపుచువచ్చిరి. ఈ యుద్ధములవలన నిరు వురకుఁ గూడఁ బ్రయోజనము లేకపోయేను. ఎవ్వరి ప్రభుత్వములు వారికి నిలిచియుండెను. ఈపోరాటములోఁ గొండవీటి రెడ్ల జ్ఞాతియైన అల్లాడ రెడ్డి కాటయ వేమభూపాలుని పక్షమున నిలిచి యాతనికి సాహాయ్య మును సలుపుచుండెను. అల్లాడ రెడ్డి కొండవీటి రెడ్లకు జ్ఞాతిమాత్రమె గౌక కొండవీటి రాజ్య పాలకుడైన అన వేమభూపాలుని మనుమరాలి