పుట:Srinadhakavi-Jeevithamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


గుంభకంగవుని హస్తంబోరుహంబున
నాపోసనంబయి హ్రస మొందె
బాషాణముల సచ్ఛ వల్ల గోలాంగూల
కపియూధముల చేతఁ గట్టుపడియె

గీ. వనధి యేభంగి సరివచ్చుననగవచ్చు
నారపా తల గంభీర వ్గారయగుచు
విపగ తా సాయమగుచు శోభాస్యపగుచు
సమసచుండైన సంతానవనధి తోడ.

క్రైస్తవమానముచే సంతానసాగర ప్రతిష్టాలిధి 1410 వ సంవత్సరము ఫిబ్రవరు 21 తేదీ శుక్రవారమగుచున్నది. ఈసంతానసాగరమును చెఱువునకు నీరువచ్చుటకే యీ సూరాంబకొడుకు రాచవేముఁడు శా. శ. 1337 మన్మధ సంవత్సర మాఘ 15 దినమునకు సరియైన కైస్త్రవమానము 1416 సంవత్సరము జనవరి 16 వ తేదీ మంగళవారమునాఁడు జగనోబ్బగండకాలువను' తవ్వించునట్లు అమినా బాదు శాసనము దెలుపుచున్నది. అది శ్రీనాధకృతియైన యొక సీసపద్యముగా నున్నది. దాని మీదిగువ నుదాహరించెదను.

.సీ. * కాకొబ్ధములు సహస్త్రంబును మున్నూట
ముప్పదియేడును నొప్పు మిగుల
మహనీయ మైన మన్మధవత్సరంబున
మఘమాసమునఁ బూర్ణిమాదినమున
"హేమాద్రి దానచి, తొమణీయంరాయ
బసవశంభకుఁ డాజీ ఫల్గుణుండు
సమదారి రాయ వేశ్యా భుజంగుండు 'వే
మయరాచ వేమనక్ష్మా వరుండు

గీ. తల్లి సూరాంబచే సమున్నత మగుచు
జరుగు సంతాన దార్దికి పరువ గాగ
నొలయు గిరి వాహినుల జగ నొబ్బగండ
కాలువఘటించె నా తారకంబుగాఁగ.

శ్రీనాథ కృతి.