పుట:Srinadhakavi-Jeevithamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

శ్రీనాథకవి


వాడుగావున శ్రీనాథుఁడు కొంచీపురమునకుఁ బోయి యవచితిప్పయను సందర్శించినకాలమున దుగ్గనకూడ పోయియుండును. అప్పటి కితడిరువతె యేడ్ల ప్రాయము గలవాఁడై యుండవచ్చును. గంగయామాత్యుఁడును వాని ప్రభువగు బసవభూపాలుఁడును. పురుషోత్తమగజపతి కాలములోఁ గూడ గొంతకాల ముండియుండవచ్చును. గంగయామా త్యుఁడు ప్రథమమునఁ గృతిపొందిన గ్రంథము నాచికేతూ పాఖ్యానమె. తరువాత నంతము నొందినది. ప్రబోధ చంద్రోదయము. నంది మల్లయ్య, ఘంట సింగయ్యల కంటే (ప్రబోధచందో దయ కర్తలు)వయస్సున దుగ్గన "పెద్దనోడుగాని సమానవయస్కుఁడు గాఁడు. దుగ్గనకవిత్వమును గంగయామాత్యుఁడు ప్రశంసించి ప్రస్తుతించిన విధ మీక్రిందిపద్యమున నభివర్ణింపఁబడినది.

వ, శుతులకు హార దేశములు సుస్థిర వాక్య పద ప్రమాణ శా
స్త్రతతుల యిక్క లాగము పురాణచయమ్ముల మేలిపద్మ ముల్
స్మృతుల నివాసముల్ కవిసమాహిత సత్కవితాగుణ ప్రసా
దితములు దగ్గుబల్లికవి తిప్పుడు. దుగ్గన గద్య పద్యముల్ -


వేముని కాశీ రామేశ్వరయాత్రలు.

పెదకోమటి వేమభూపాలుఁడుశా.శ.1326 తారణ సంవత్సరములో (క్రీ. శ.1404 రామేశ్వరయాత్రకుఁ బోయినట్లు ద్రవిడ దేశమునందలి తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి సువర్ణ కిరీటముసమర్పించినట్లు వాయించి యూ దేవాలయమునఁ జిక్కించిన శాసనము బట్టి 'దెలియుచున్నది. ఈ శాసనమున నితని వంశసర్జన. మంతయుఁబద్యములలో సభివర్ణింపఁ బడియున్నది. ఇందిత డిక్ష్వాకువంశమునఁ బుట్టిన క్షత్రియుఁడుగా " నీక్రిందిపద్యములో వర్ణింపఁ బడియెను.

శా. ఏవంశంబున సుద్భవించీ కరుణాహృత్కజుఁ డిక్ష్వాకుడున్
ధీవర్యుండు రఘుం డజుండు ఘనపంక్తిస్యందనూండుంహుకుం
డివిశ్వం బును ఖ్యాతి నేలి రలఘుప్రే కాంవయ బంచు నా
త్రీవర్యుల్ జనియించి 'యేలి నతం బీతిన్ బెక్కురా పిమ్మట