పుట:Srinadhakavi-Jeevithamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


రాజ్యమునందును నుండుచుఁ గవిత్వములం జెప్పుచు వచ్చిరి. సుప్ర సిద్ధకర్ణాట కవులగు నాగవర్మ మొదలుగా గొంద ఱాంధ్ర దేశమున జన్మించినట్లు కర్ణాటసారస్వతమువలన విదితము కాఁగలదు. సుప్రసి ద్ధాంధ కవులగు నన్నె చోడాదులు మొదలుగా బెక్కండ్రు కవితా రచనయందుఁ గన్నడపోకల ననుసరించుటయే గాక కర్ణాట భాషాపదములను బెక్కింటిని తమ గ్రంథములలోఁ జొప్పించి యున్నారు. శబ్దశాస్త్రజ్ఞులకు మాత్ర మీవిషయము చక్కగా బోధ పడఁగలదు. శ్రీనాథుఁడు తన కావ్యములకు కర్ణాటభాషా సంప్రదాయా నుసారముగ రచియించిన వాడగుట చేత గోదావరీతీరస్థమైన రాజమహేం ద్ర పురికి వచ్చినప్పు డచ్చట కవులోఁ గొందరతని కవిత్వము ప్రౌఢ మైనదే కాని సంస్కృతపదఘటిత మైనదనియు, మఱికొండఱు పలుకు చమత్కారమున నాంధ్ర భాషనలె నున్నది గాని యాతనిభాష కర్ణాట భాషయనియు వంకలు పెట్టి యీక్ట్యాళువులై 'వెఱి మొఱి యాక్షేపణలు చేయ నారంభించిరి. శ్రీనాథుఁడు సకలవిద్వాసనాథుఁడని యెఱుంగక పండితుల నేకులు వివాదములు పెట్టుకొని యెట్టులైన నాతనివంచించి సాగనంపవలయునని ప్రయత్నించిరి. అందులకే శ్రీనాథుఁడు తన్నధిక్షేపింప వచ్చిన పండితమ్మన్యులను, కుకవులను


తే. బోడ మల్పంబు, గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరంబు ముచ్చరము మనము,
కూపమండూకములు బోలెఁ కొంచే 'మెఱిగి
పండితమ్మన్యులైన నైతండికులకు.

తే. నికటముననుండి ప్రతి పుట నిష్ఠుర ముగ
సడరి కాకులు బిట్టు పెద్దఱచి నప్పు
డుదధి రాయంచ , యూరక యుంట లెస్స
సైపరాకున్న సెం దేని జనుటయొప్పు,

అను పద్యములలో నిందించి తరువాత,