పుట:Srinadhakavi-Jeevithamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

7


 తే. ప్రౌడి బరికింప సంస్కృత భాషయండ్రు
పలంకుమడి కారమున నాంధ్ర భాషయందు
రెవ్వరేమన్న నండ్రు గా కేమికొఱత ,
నాకవిత్వంబు నిజము కర్ణాట భాష.

అను పద్యము జెప్పె.

ఇట్టి కుకవి నిరాకరణమునందే మనకవిసార్వభౌముఁడు తనకవి త్వము కర్ణాటభాషయని పలికినది. కాఁబట్టి యీతనికవిత్వ మాంధ్ర కవిత్వముగాని కర్ణాటకవిత్వము గాదు. ఈ కవిభాష యాంధ్ర భాష గాని కర్ణాట భాష కాదు. తన భాష కర్ణాటభాష మని చెప్పినది తాను రాజమహేంద్రపురమునకు వచ్చినతరువాతఁ బ్రథమమునఁరచించిన భీమే శ్వరపురాణమునందు మాత్రమె చెప్పెనుగాని యంతకుఁపూర్వము తాను రచించిన పండితారాధ్య చరిత్రమునఁగాని మఱి యేగ్రఁం థమునఁగాని చెప్పి యుండక పోవుటకుఁ గారణము పైని నేనుదహరించిన దేగాని శ్రీనాథుని జన్మ' దేశము తన దేశ మగట కాదు. దీనింబట్టి యాతని జన్మభూమి కర్ణాట దేశమగుట చేతఁ గర్ణాట భాషయం దభిమాసము చూపించెనని యూహించుట బ్రాంతిగాని వేరొండుగాదు. శ్రీ వీరేశలింగముగారు "తా ము: నూతనముగాఁ బెంచి వ్రాసి ప్రచురించిన నూతన గ్రంథములో శ్రీనాథుని జీవిత సంఘట్టమున నాయభిప్రాయమునే తమయభిప్రాయ ముగా నిట్లు లిఖించిరి,

“ఎక్కడనుండి యైనఁ గ్రోత్తగా నొక కవీశ్వరుఁడుగాని పండితుఁ డుగాని తమపట్టణమునకు వచ్చినప్పు డచ్చటి పండితులు మత్సర గ్రస్తు లయి యానూతన విద్వాంసుని నాపించుటయుఁ బరాభవింపఁజూచుట యు సామాన్యములే గదా. శ్రీనాథకవి కర్ణాటక దేశమునుండి రాగానే రాజమహేంద్రవరమునందలి పండితులు శ్రీనాథుని కవిత్వమంతయు సం స్కృత భాషయే యనియు మాటలచమత్కారముచేతఁ 'దెలుఁగుభాష లాగు గనఁబడుచున్నను నిజముగాఁ గర్ణాటభాషా ధోరిణియే యనియు,