పుట:Srinadhakavi-Jeevithamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

5


కర్ణాట దేశమని యూహించుట భ్రాంతి గాని మఱియెండుగాదు. ఇంక రెండన హేతువును విచారింతము. శ్రీనాథకవి భీమేశ్వర పురాణములో

ప్రౌడిబరికింప సంస్కృత భాషయండ్రు
పలుకునుడికారమున నాంధ్ర భాషయందు
'రెవ్వ రేమన్న నండ్రుగా కేమకొఱత
నాక విశ్వంబు నిజము కర్ణాట భాష.

అను నొక పద్యము గానంబడుచున్నది. ఈ గ్రంథము రాజమహేం ద్ర పురాధిపతియగు నల్లాడ వీరభద్రనృపాలునికి మంత్రియగు 'బెండపూడి అన్నామాత్యుని కంకితము చేయఁబడినది. కనుక నీపద్యరచనా కాలము పెదకోమటి వేమభూపాలుని మరణానంతరము కొండవీటి రాజ్యము కర్ణాట దేశాధీశ్వరుల ఆధీనము కాఁగా శ్రీనాథుఁడు అన్న మాత్యుని సంబంధ బాంధవ్యము మూలమున రాజమహేంద్రపురమునకు నేతెంచి, వారలకడ సాస్థానకవిగ బ్రవేశించిన కాలమై యున్నది. కాకతీయ సామ్రాజ్య మంతరించిన వెనుక నాంధ్ర దేశములో దక్షిణ భాగము (పాకనాఁటిసీమ) కర్ణాటాధీశులు యాధీనమై కర్ణాట రాజ్యముగానే పరీ గణింపఁబడుచు వారిచేతనే పరిపాలింపఁబడుచు వచ్చినది. ఆ భాగము లోనుండు నాంధ్రుల కాలమునను నంతకుఁ బూర్వముననుగూడ గర్ణాట కులతోడఁ దఱుచు పొత్తుగలిగియుండుట సంభవమగుచు వచ్చెను. అంధ్ర కవుల నేకులు గర్ణాట రాజ్యమునందును కర్ణాటకవుల నేకులాంధ్ర


దము " నెఱుగని వానివలె నిట్లు వ్రాసియున్నారు. " ఈ పద్యమునందు కర్ణాట దేశకట ' కపద్మపన హేళి' యని తనకు విశేషణము చేసి"ని తాను గర్ణాట రాజ్యరాజు గాని యండు విద్యావిజయమునొంది యచ్చటి పండిశులను సంతోష పెట్టితినని సూచించి యున్నాఁడు. కర్ణాట దేశకటక పద్మపన హేళి' యనఁగా కర్ణాట దేశ రాజధాని యనెడు పద్మరాజికి నూర్యుడని యర్థము. సూర్యుఁ డెట్లు పద్మవనము నలరించునో యట్లే తానును కర్ణాటకటక వాసులైన విబుథబృందము నలంకరించిన వాడనని కవి యభిప్రాయము. ” తమగ్రంధములో జెప్పిస "నేమి చెప్పుకున్న నేను మూయర్థము సంగీకరించి మాతో నేకీభవించినందులకు సంతసించు చుస్నొరము,