పుట:Srinadhakavi-Jeevithamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

117


డొకనాఁడు 'పుర మేగిన పుడిట్టి యసమర్ధ కవి తారచనములు చెవికీ వినంబడి సపు డీక్రింది చాటువును జెప్పి వారి నపహాస్య భాజనులుగాఁ జేసెనని తెలియుచున్నది.

ఉ. బూడిదబుంగయొడలుపోడమీఁదక్క మగ ంబు నెల్లనై
వాడల వాడల దిగే వారును వీరును జొచ్చొచోయనిన్
గోడల గొందులం నొడిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిడ నీవుమంగవివి కాదుగదా యనుమాన మయ్యెడిన్ .


వామనభట్ట భాణుఁడు.

వేమభూపాలుని యాస్థానమున శ్రీనాథునిఁ జెప్పిన వెనక బేరెన్నిక గాంచినకవి వామనభట్ట బాణుఁడు. ఇతఁడొక గొప్ప సంస్కృతకవి, ఇతఁడు సంస్కృత భాషలో గ్రంథములఁ బెక్కింటినీ రచియించి విశేష ముగాఁ బ్రఖ్యాతిగాంచి వేమభూపాలుని మన్ననకుఁ బాత్రుడయ్యెను. వీరనారాయణ చరిత్రమను సామాంతరముగల 'వేమభూపాల చరిత మను నాఖ్యాయిక యు, రఘునాథాభ్యుదయము నలాభ్యుదయమునను కావ్యములను, పార్వతీపరిణయ శృంగారభూషణములను రూపకములను శబ్దచంద్రిక , శబ్దరత్నాకరము, అను నిఘంటువులను, హంస సందేశమను ఖండ కావ్యమును రచించిన వాడు. తన నిఘంటువులలోఁ బ్రారంభమున


శ్లో. విద్యారణ్యగురూన్ సార్వభౌమాద్య ఖిల సత్క వీన్
నమస్కృత్యాథ బాణేశ క్రీయ తే శబ్దచంద్రీకా!
శ్లో. వర దాగ్ని చిత 8 పౌత్ర పుత్త మటియజ్వ నః
జాగర్తీ వా మనో బాణోవత్స వంశశిఖామణి!!


అని చెప్పుకొని యుండుటచేత నితఁడు విద్యారణ్యులకు శిష్యుం డనియు, సార్వభౌమకవి యనఁగా శ్రీనాథుని ప్రత్యర్థి యగు ఉండిమకవి సౌర్వభౌముఁ డై యుండుననియు, శృంగారభూషణ భాణము తుంగాభద్రా తీరమున విరూపాక్షోత్సవమునందుఁ బ్రదర్శింపఁ బడినట్టురచింప బడినదగుటచే నీతని జన్మస్థలము విద్యానగర ప్రాంత మేమోయలి సంశ..