పుట:Srinadhakavi-Jeevithamu.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రీనాథ కవి

  ఆ శ్రీమద్వాలలో తే. ట్రయ చూసలను
వస్తా శ్రీ కట్టు కళ్యాణ్య పౌల్‌ మామిడీ చుఁam
కు పెద్దగ్యాస్య తం జోగుహాయకాః
షెడకోమటి నే మేం క్రమం లో నా లేక థీమతా
జ్యోగాలు సృశా దృశ్యజా
సి.యామాత్యు లే: సు)లోకి హితైషిణా
సచసి..కి న్యాఖ్యాగూ ళ


ఇతఁడు దైవజ్ఞశి ఖామణి యగుటచేత సీ శ్రీనాథభట్టరుకవి పం బాంగ స్థిర మంత్ర రక్షణకళా ప్రౌడుండని తన నైషధమున నీతని సభివర్ణిం చియుండఁబోలు. సకలవిద్యా పారంగతుండయిన యీ యమాత్య శేఖ రుండెప్పుడును “మృదుమదుర చిత్ర విస్తర కవితావిలాస వాగీశ్వరులగు కవీశ్వగుల చేతను, పతంజలిక ణాదాక్ష చరణపక్షీలాది శాస్త్ర సిద్ధాంత కమలవసహుసులగు విద్వాంసుల చేతను, భరతమతంగద త్తళ కాపాలాంజ నేయ ప్రణీత సంగీతవిద్యారహస్య విజ్ఞా వైజ్ఞానిక స్వాంతులగు కళావం తుల చేతను, శక్తి త్రయ చతురుపాయ షాడ్గుణ్యప్రయోగ యోగ్యవిచా రులగు రాయ బారులచేతను, నిఖిలపురాణేతిహాస సంహితా తాత్పర్య పర్యాలోచనా ధురంధరధిషణా సము త్సాహులగు పౌరాణిక వర్యుల చేతను, గొల్వుకూటంబుగఁ బరి వేష్ఠింపుఁబడియుండి సరససాహిత్య గోష్టీ వినోదప్రసంగంబులు జరుపుచుండు” నని నైషధమహా కావ్యము నందభి వర్ణింపఁబడి యుండుటఁ జూచియు మహా మేధావులయిన లక్ష్మణ రావు గారును, వీరేశలింగముగారును నొక్కకలముపోటుతో గవిలెకట్టలుమోయు గుమాస్తాగా నీడ్చి వేయఁ బ్రయత్నించిన దెంతయు శోచనీయము.

కొండవీటి గార్దబములు

కొండవీడాకాలమున నసంఖ్యాకులగు కవులతో నిండియుండెడి దనియు, వారిలో సరసకవులు, వీరసకవులు, కుకవులు గూడ నుండెడి వారనియు, ఎక్కడఁజూచినను సుకవుల కవితారచనము లేగాక యసమర్ధు .. లగువారి కవితారచనములు గూడ వినంబడుచుండెడి వనియు, శ్రీనాధుడు "