పుట:Srinadhakavi-Jeevithamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

శ్రీనాథ కవి

వాఁడు. యముగలుగుచున్న దనియు, శ్రీ ప్రభాకరశాస్త్రిగారు వాయుచున్నారు. ఈయూహలు నిలుచునవి యైనను గాకపోయినను జన్మస్థలము నిర్ధా రించుట కీశ్లోకములు చాలవు. విద్యారణ్యుల జన్మస్థానము విద్యానగ నము కాదు. విద్యానగరము క్రీ. శ. 1336 వ సంవత్సరమున మొదటి హహన రాయలచే విద్యారణ్యుని పేరీటఁ బునరుద్ధరింపఁబడినది. అప్పటికి విద్యారణ్యునికి ముప్పదియైదు సంవత్సరములయిన నుండియుండునను టకు సంశయింపఁబని లేదు. డిండిమకవి సార్వభౌముఁడు దేవరాయలు యొక్క తుది కాలమునను ప్రౌఢ దేవరాయ" యొక్క ప్రారంభ కాల మునను ప్రఖ్యాతి గాంచియున్న వాఁడు. దేవరాయలు క్రీ. శ. 1406 వ సంవత్సరమున విజయనగర సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుడయిన విజయనగర సామ్రాజ్యమును పాలించిన వారిలోఁ జక జక్రవర్తియని జెప్ప దగినవాడు రెండవహరిహర రాయలు, ఇతఁడు విద్యారణ్యులకు శిష్యుండేయైయుండి విద్యాభ్యాసమునుగావించి వాడనిన చెప్పినయెడ నేకాలము నందనిప్రశ్నము పుట్టక మానదు. 'రెండవహరిహరుఁడు క్రీ. శ. 1322వ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁడయ్యెను, గనుక సప్పటి విద్యారణ్యుడు కొంచెమించుగా 51 సంవత్సరముల వాఁడై యుండును. అట్టివానివద్ద విద్యాభ్యాసము చేసియున్న యెడల నడమమిగువ దేండ్ల ప్రాయమువాఁడై సయిన యుండవలయును. విద్యారణ్యస్వామిపట్ల నతి గౌరవము జూపెడి రెండవ హరిహరుఁడు విద్యారణ్యుని శిష్యుని విద్యానగర వాసుఁడైన పండితుని తనకంటెను దక్కువస్థితియందుండిన గోమటి వేమభూపాలు నికి విడిచి పెట్టియుండునా! ఇతఁడు విద్యారణ్యునకు శిష్యుడై విద్యానగ గనివాసియై యితఁడు పేర్కొన్న సార్వభౌమకవి డిండిమ భట్టారకుఁ డే మైనయెడల, వీరూ పాక్షోత్సవమునునది. హంపీవిగూ పాక్షస్వామియే మైయుండిన యెడల, నమ్మహా సామ్రాజ్యమును, ఆ మహానగరమును విడిచి కొండవీడు చేరి వేమభూపాలునీ యాస్థానముననుండి "వేమభూపాలచరిత మును రచించి యనేకాతిశ యోక్తులతో నతని నొకమహాచక్రవర్తి గానభి