ఈ పుట ఆమోదించబడ్డది
న జాయతే మ్రియతే వా కదాచి
న్నాయం భూత్వా భవితావా నభూయః
అజో నిత్య శాశ్వతో౽యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే.
ఇతడు పుట్టుటలేదు. ఏకాలమందైనను చచ్చుటయు లేదు. ఇతడొకసారియుండిమరియొకసారిలేకుండనుండుటలేదు.
జన్మములేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడై
యితడు శరీరము చంపబడినను తాను చంపబడడు. 2-20
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో ౽ పరాణి
తథా శరీరాణి విహాయజీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ.
చినిగిన బట్టలను విడిచి క్రొత్తవానిని నరుడెట్లు
గ్రహించుచున్నాడో, అట్లే జీర్ణములైన దేహములను విడిచి,
కొత్తవానిని దేహి పొందుచున్నాడు. 2-22
అచ్ఛేద్యో౽యమదాహ్యో౽య
మక్లేద్యో౽ శోష్యఏవ చ
నిత్యస్సర్వగతస్థ్సాణు
రచలో౽యం సనాతనః.
అతడు నరకబడతగని వాడు, కాల్చుటకు సాధ్యము
కానివాడు, తడుపబడవీలులేనివాడు, శుష్కింపజేయ