సాధ్యముకానివాడు, నిత్యుడు, అన్నియెడలనుండువాడు, ఒకచోట నెలకొననివాడు, చలించనివాడు, సనాతనుడు. 2-24
అవ్యక్తో౽యమచింత్యో౽యమవికార్యో౽యముచ్య తే
తస్మా దేవం విదిత్వైనం నాను శోచితు మర్హసి.
అతడు వ్యక్తముకానివాడు, చింతింప వీలులేనివాడు.
వికారము పొందింపబడజాలనివాడని చెప్పబడుచున్నాడు.
కావున నతని నట్లు తెలిసికొని నీవు దుఃఖింపగూడదు. 2-25
దేహీనిత్య మవధ్యో౽యం దేహేసర్వస్య భారత
తస్మా త్సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
ఎల్లర శరీరమందున్న యీయాత్మ యెన్నడును
చంపబడ వీలులేనివాడు. కావున ఈభూతముల వేనిని
గూర్చియు దుఃఖింపనక్కరలేదు. 2-30
యావత్సఞ్జాయతే కిఞ్చిత్ సత్త్వం స్థావరజంగమమ్,
క్షేత క్ష్రేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్ష భ.
స్థావరమైనదిగాని, జంగమమైనదిగాని, ఏప్రాణి పుట్టి
నను నది క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమువలన కలిగినదని
తెలిసికొనుము. 13-27
యథా సర్వ గతం సౌక్ష్మ్యా దాకాశం నోపలిప్యతే,
సర్వత్రా౽నస్థితో దేహీ తథా౽త్మానోపలిప్యతే.