శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు: ఎవరినిగూర్చి దుఃఖింప నావశ్యకతలేదో, వారినిగూర్చి దుఃఖించుచున్నావు. తెలిసిన వారివలె మాట్లాడుచున్నావు. చచ్చినవారికోసమును, ఉన్న వారికోసమును తెలిసినవారు దుఃఖపడరు. 2-11
నత్వేవాహం జాతు నాసం న త్వంనేమే జనాధిపాః
నచైవ న భవిష్యామస్స ర్వే వయ మతఃపరమ్.
ఇంతకు ముందు నే నెన్నడును లేకుండుటలేదు. నీవును
నిక్కడనున్న రాజులునెవ్వరును నట్లే. ఇకమీద నొకనాడును
మనము లేకుండ బోవుటయు నుండదు. 2-12
దేహినో౽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాన్తరప్రాప్తిర్ధీర స్తత్ర నముహ్యతి.
ఆత్మ కీదేహమున నెట్లు బాల్యము, యౌవనము,
ముసలితనమును గలుగుచున్నవో, అట్లే వేరొక శరీరమును
జన్మమును ఏర్పడును. కావున, దీనికి ధీరుడువిచారింపనేల? 2-13
అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్
వినాశ మవ్యయ స్యాస్య న కశ్చిత్కర్తు మర్హతి.
ఈలోకములోనున్న యెల్లప్రాణుల శరీరములందును వ్యాపించి
యున్న వస్తువు నాశనము కానిదని తెలిసికొనుము. దీనిని
నాశనముచేయుట యెవ్వరికిని సాధ్యముకాదు. 2-17