పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

అంతంకు మున్నువిదురుండు తీర్థయాత్రకుఁ జని మైత్రేయు ముందటఁ గర్మయోగంబులైన ప్రశ్నలు గొన్ని చేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలసి కృతార్థుండై హస్తిపురంబునకు వచ్చిన(1-296)

అధ్యాయము - 13

క. బంధుఁడు వచ్చె నటంచును, గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం

బంధములు నెఱపి ప్రీతి న, మంథరగతిఁ జేసి రపుడు మన్నన లనఘా! (1-297)


వ. అంత ధర్మనందనుడు విదురునికి భోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవారు లందఱు విన నిట్లనియె.
(1-298)


సీ. ఏ వర్తనంబున నింత కాలము వీరు సంచరించితిరయ్య? జగతిలోన

నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి? భావింప మీవంటి భాగవతుల

దీర్థసంఘంబుల దిక్కరింతురుగదా! మీయందు విష్ణుండు మెఱయుకతన

మీరె తీర్థంబులు మీకంటె మిక్కిలి తీర్థంబు లున్నవే? తెలిసిచూడ.

తే. వేరె తీర్థంబు లవనిపై వెదకనేల, మిమ్ముఁ బొడగని భాషించు మేలె చాలు

వార్తలేమండ్రు? లోకులు వసుధలోన, మీకు సర్వంబు నెఱిగెఁడి మేరగలదు.(1-299)


మత్తకోకిల. తండ్రి సచ్చిన మీఁద మా పెదతండ్రి బిడ్డలు దొల్లి పె

క్కండ్రు సర్పవిషాగ్ని బాధల గాసి పెట్టఁగ మమ్ము ని

ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా

తండ్రిభంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? (1-300)


క. పక్షులు తమ ఱెక్కలలోఁ, బక్షంబులురాని పిల్లపదువుల మమతన్

రక్షించినక్రియ మీరలు, పక్షీకరణంబు సేయు బ్రతికితిమి గదే! (1-301)


క. మన్నారు? ద్వారకలో, నున్నారా? యదువు లంబుజోదరు కరుణన్

గన్నారా? లోకులచే, విన్నారా? మీరు వారి విధి మెట్టిదియో. (1-302)


చ. అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోకవ

ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి, యదుక్షయంబు సె

ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్

విను మని చెప్పఁ డయ్యె యదువీరుల నాశము భార్గవోత్తమా! (1-303)