52
సీ. సమదర్శనంబున జలజాతభవుఁ డనఁ బరమ ప్రసన్నత భర్గుఁ డనఁ గ
నెల్లగుణంబుల నిందిరావిభుఁ డన నధిక ధ్ర్మమున యయాతి యనఁ గ
ధైర్యసంపద బలి దైత్యవల్లభుఁ డన నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనగ
రాజితోదారత రంతిదేవుం డన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ
తే. యశము నార్జించుఁ , బెద్దల నాదరించు,నశ్వవేభంబు లొనరించు,నాత్మసుతులు
ఘనులఁ బట్టించు,దండించు ఖలులఁబట్టి మాధనుఁడు నీమనుమండు మానవేంద్ర! (1-291)
"భుజంగ ప్రయాతము". హరించు గలిప్రేరి తాఘంబు లెల్లన్
భరించున్ ధరన్ రామభద్రుండు వోలెన్
జరించున్ సదా వేదశాస్త్రాను వృత్తిన్
గరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. (1-292)
వ. ఇట్లు పెక్కేండ్లు జీవించి, భూసుర కుమారక ప్రేరితంబైన, తక్షక సర్పవిషాన లంబునం దనకు మరణంబని యెఱింగి, సంగవర్జితుండై, ముకుందు పాదరవింద భజనంబు సేయుచు శుక యోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుంఢై, గంగా తటంబున శరీరంబువిడిచి,నిర్గత భయశోకంబైన లోకంబు ప్రేశించును. అని జాతకఫలంబు సెప్పి లబ్ధకాములై భూసురులు చనిరి. అంత (1-293)
క. తనతల్లి కడుపు లోపల, మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం
డనుచుఁ బరీక్షింపఁగ జను, లనఘుఁ, బరీక్షిన్నర్రేంద్రుఁ డండ్రు నర్రేంద్రా! (1-294)
ఆ.కాలళచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణుఁ, డైన భంగఁ దాత లనుదినంబుఁ
బోషణంబు సేయుఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ,పటల పాలకుంఢు బాలకుంఢు(1-295)
వ.మఱియు ధర్మజుండు బంధుసంహార దోషంబు వాయుకఱకు నశ్వమేధయాగంబు సేయందలంచి,ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబైన విత్తంబు చాలక చిత్తంబునం జింతించునెడ, నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరత్తుండను రాజు మఖంబుచేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తముత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన,నా రాజసత్తముండూను సమాయత్త యజ్ఞోపకరణుండై, సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు చేసి, పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించె. (తదనంతరంబు కృష్ణుండు బంధు ప్రియంబు కొఱకుఁ గరినగరంబునం గొన్ని నెల లుంఢి, ధర్మపుత్రాదులచే నామంత్రణంబు వడసి, యాదవ సమేతుండై ధనంజయుండూ తోడరా నిజనగరంబునకుఁ జనియె.)