పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనయంబకంబులు దనయంబకము లట్ల
                              పరభీరువిముఖతఁ బరిఢవిల్లఁ


గీ.

బరఁగుఁ గఠినాద్రి జడలు తజ్జరఠకమఠ
కూటకిటిగూడచరణదిక్కోటికరటి
కుటిలతాసహభూసౌఖ్యఘటన భూరి
భుజబలవిహారి యార్వీటిబుక్కశౌరి.

వసుచరిత్రము

క.

ఆచంద్రునివంశంబున
భూచంద్రుం డారెవీటిబుక్కనరేంద్రుం
ణాచక్రవాళశైల
క్ష్మాచక్రస్ఫూరికీర్తిసాంద్రుఁడు పుట్టెన్.


క.

అబుక్కనృపాలుబా
హాబలము కొలంది తదసిహతరిపుమీర
ప్రాబల్యనిరాకృతనల
కూబరునకుఁ దెలియుఁ దెలిసికొనఁ గలఁ డేనిన్.


చ.

మతి నజుడంచు రూపమున మన్మథుఁ డంచు నయోన్నతిన్ బృహ
స్పతి యనుచున్ వదాన్యతను భానుసుతుం డనుచు న్నుతించునా
ర్యతతి "నిరంకుశాః కవయ”యం చది యోర్చుట గాని బుక్కభూ
పతికి సముండు లేడు తలఁపన్ భువనంబుల నేగుణంబులన్.

కళాపూర్ణోదయము

అయినను రామకృష్ణకవిగారివాక్యములయందు గౌరవముంచి యీకవిని బకునైదవశతాబ్దికవులలో చేర్చితిని. వల్లభరాయకృతక్రీడాభిరామమండదియొకపద్య మీతనిఛందోగ్రంథమునం దుదాహరింపఁబడినదని శ్రీ కే. రాఘవాచార్యులు గా రనియుండుటవలనను, వల్లభామాత్యుని కాలము క్రీ. శ. 1400 ప్ర్రాంత మగుటవలనను, శ్రీధరకవి పదునైదవశతాబ్దియం దుత్తరార్ధమున నున్నవాఁడని చెప్పవచ్చును. ఆరెవీటి బుక్కరాయలకాలముకూడ నదియే. ఈ సందర్భమున రాఘవాచార్యులుగారు, “అళియరామరాజుముత్తాత యగుసోమభూపాలున