చ. | వెలయగ బొండుమల్లియలు వేనలి నంగమునన్ విభూషణా | |
గీ. | కృతులఁ ద్రత్వత్రయమ్మును దత్వమొకటి | |
ఈతని గ్రంథమునుండి యుదాహరణములను గైకొనకపోయినను, అప్పకవి యీతనిని దనగ్రంథమునఁ బేర్కొనియుండుటచే నీతఁ డప్పకవికిఁ బూర్వుఁ డనుట నిశ్చయము - శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు శ్రీధరచ్ఛంద మళియరామరాయలముత్తాత కంకితమీయఁబడినదని బద్దెన నీతిశాస్త్రముక్తావళిపీఠికలో వ్రాసియున్నారు. శ్రీధరచ్ఛందమునందు బద్దెన నీతిశాస్త్రముక్తావళిలోనిపద్యము లుదాహరింపఁబడినవని రామకృష్ణకవిగారు వ్రాసియుండుటచే నాగ్రంథ మాయనయొద్ద నున్నదని యూహింపఁదగియున్నది. నాకు శ్రీధరునిగ్రంథము లభింపలేదు. అళియరామరాయలముత్తాత ఆరెవీటి బుక్కరాజు. ఇతడు ప్రసిద్ధపురురుషుడు. రామకృష్ణకవిగారు ఆరెవీటిబుక్కరాయ లని వ్రాయక యళియరామరాయలముత్తాత యని యేల వ్రాసిరో తెలియకున్నది. బుక్కరాయలు బాహుబలముచేఁ గీర్తిని సంపాదించినవాఁడు కాని కవిపండితపోషకుఁ డనుకీర్తి యాతనికి లేదు. రామరాజభూషణుఁడును బింగళి సూరనార్యుఁడును బుక్కరాయలను వర్ణించిన పద్యముల నీక్రింద నిచ్చుచున్నాఁడను.
సీ. | తనభవ్యధామంబు తనభవ్యధామంబు | |