పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

శ్రీ వేంకటేశ్వర వచనములు

చందంబునఁ, బుష్పంబులోని పరిమళంబుపోలిక, బీజంబులలోని వృక్షం బుల కైవడి నీరీతి జగంబులలోన నీవును, నీలోన జగంబులును; బాహ్యాంతరంబుల నీవు పరిపూర్ణుండ వై యున్నాఁడవు. నీవు వలసినట్లుం డుము. నీకు శరణని బ్రతికెదము. శ్రీ వేంకటేశ్వరా !

139

కల్క్యవతారా ! మిమ్ముఁ గొలిచిన సాధుజనంబులకు వరదహస్తం బును, భయపడ్డ దీనులకు నభయహస్తంబును జూపుకొని సాకారమై నిలుచున్న వాఁడవు. శత్రుసంహారార్థంబై యొక శైలచక్రంబును విజయ ఘోషంబులందఱకును నెఱిఁగించుకోఱకు నొక చేత శంఖంబును బెట్టు కొని యున్నా ఁడవు. ఇంక నే మూహించి యాసపడి వేద కెడి దేమున్నది? కోరకే తొల్లి సర్వార్థంబులు నొసగ నంతర్యామివై కాచుకొని యున్నా ఁడవు. వెదకం బోయిన తీగ ముంజేతఁ దగిలినట్లు, వేడఁబోయిన యర్దంబు వేడుక వచ్చినట్లు, ఆడఁబోయిన తీర్థం బెదురుగా వచ్చినట్లు, తోల్లి చేయని పుణ్య ఫలంబులు చేతికి వచ్చినట్లు సకల 'తిరుపతులం బొడచూపు చున్నాఁడవు. సకలమైన వారికి బ్రదుకుఁద్రోవలు నీవుండిన యాకారంబు చెప్పుచున్నది. శ్రీ వేంకటేశ్వరా !

140

రవిచంద్రలోచనా ! షూ వేడుకకు నీప్రత్యక్షంబుఁ గోరెదము గాక నీవు ప్రత్యక్షంబయిన నెట్లు కనుఁగొన నోపుదుము. నీవు కోటిసూర్య ప్రకాశుండవట. ఒక సూర్యుండు దృష్టులకు మిఱుమిట్లు గొల్పెడిని నీ వెట్లు గోచరించెదవో యద్భుతంబు. శ్రీ వేంకటాద్రి మీద నీరూపంబు దర్శించితిమి. మాకు నిదియె బ్రహ్మ సాక్షా త్కారంబు శ్రీ వేంకటేశ్వరా!

141

జగత్ ప్రాణా! బ్రహ్మచర్యంబుననుండి సాధించు ఫలమును గృహస్థాశ్రమం బునంజేసి చెందెడి పుణ్యంబును, వానప్రస్థధర్మంబునం గట్టుకొనియెడి విశేషంబును, యతినిష్ట, చేతఁ బొందెడి యానందంబును నీదాస్యంబునన .