పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

63

సాధించుకొంటిని, నానా వేదంబులం జదివిన యాధిక్యంబును నీ నామో చ్చారణంబునఁ గలిగించుకొంటిని. అఖిలలోకంబుల సౌఖ్యంబులు మీ గుడిపంచనే దొరకించుకొంటిని. అమరత్వంబు వైష్ణవత్వంబునం గైకొంటిని. అన్ని తీర్థంబుల స్నానంబులును గంగాస్నానములో నిలిచినట్లు, మంత్రజపంబు లెల్లను బ్రణవంబులోఁ జిక్కినట్లు తపంబుల మాహాత్మ్యంబులు భక్తి చేతం దక్కినట్లు నీ కృపవలన నాకు సంభ వించెలే శ్రీ వేంకటేశ్వరా !

142

కూర్మావతారా ! బ్రహ్మాండం బొకటి, బ్రహ్మలు తొమ్మండ్రు, రుద్రులు పదునొకండ్రు, దేవతలు ముప్పదిమూఁడుఁగోట్లు. ఇందఱిలో నెవ్వరి ననుసరించెదము. అందఱకును మూలకారణం బైన యాదిమూర్తివి నీవని నిన్ను నొక్క నిం గొలిచితిమి. ఇంక నిందఱును దృప్తులై మాకుఁ బ్రసన్నమయ్యెదరు. అటేగదా వృక్షంబునకు మొదటం బోసిన నీరు కొనల కెక్కి తనివిఁబొంది ఫలించు; నటువలెనే నా చేత నిర్మింపఁబడిన దేవతలందఱును మిమ్ముఁజూచి మాకుఁ బ్రసన్న మయ్యెదరు. బహు మార్గంబులం దగిలితేను మనస్సు చలియించును. ఏకాగ్రబుద్ధిని మిమ్ము నేవించెదము, శ్రీ వేంకటేశ్వరా !

143

సముద్రసేతుబంధనా ! నీవలన నీసంకల్ప రూపం బైన ప్రకృతియున బ్రకృతివలన మహత్తును, మహత్తునలన నహంకారంబును, నహ కారంబువలన మనస్సును, మనస్సువలన సకలేంద్రియంబులును, బంచ తన్మాత్రలు జనించె. ఆ తన్మాత్రంబులవలన పంచమహాభూతంబులును బొడమె. కూడ నిరువదినాలుగు తత్వంబులయ్యె. ఆ యిరువది నాలుగు తత్త్వంబులైన జీవులలో నీవు వేంచేసియుండి ప్రకృతి భోగంబులన్నియు ననుభవింపఁ జేయుచున్నాఁడవు. నీవు ప్రాణబంధుండవై లోకంబు లేలుచున్నాఁడవు. నిన్ను వేడుకొనియెదము. నీకుఁ బ్రియంబుఁ జెప్పె