పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

61


136

ఉద్దవ వినుతా ! సర్వమైన వారికి నీవాహారంబు గొను వేళను ఆయా పదార్థంబులరుచులు జిహ్వలకొకరీతి వె. తరుణీ సంగమంబులు నొక్క చందంబులె, వీనుల వినియెడి వినికియును నొక్క జాడయె. ముక్కులా ఘ్రాణించు పరిమళంబును నేత్రంబులం జూచిన తెలివియును నొక్కతీరె. విచారించితే అనుభవంబులయెడ నేక సూత్రంబె అవుచున్నది. " ఓహో ! నీ ఘటన యత్యాశ్చర్యంబు, అన్నిట నేర్పరి వౌదు శ్రీ వేంకటేశ్వరా!

137

కంసమర్దనా ! నీవు ఆదివిష్ణుండవు, నీ యాత్మసంభవుండై న బ్రహ్మదేవుండపరవిష్ణుండు, అతనిచేత సృజింపఁబడ్డ వారందఱు వైష్ణవులే. " సర్వం విష్ణుమయం జగత్" అందురుగావున నందఱును మీయధీ నులే. వారి వారి పూర్వజన్మానుగుణ్యంబునం గొందఱు శైవులగుదురు. కొందఱు మాయావాదులగుదురు. అందులకు నింక నోక్క విశేషంబు గలదు. దేవతాంతర మతాంతర సాధనాంతర ప్రయోజనాంతరములు విడిచి తదేకనిష్ఠులై మిమ్ముఁ గొలిచినవారు పరమవైష్ణవులు. విదురుని యంతరంగులు. ఇతర మతంబులవారునిన్నె ఱింగిన నెఱుంగకుండిన సకల దేవతలును నీ యంశసంభవులుగనుక నా దేవతలఁగొల్చినవారును నీవారే శ్రీ వేంక టేశ్వరా'!

138

అహల్యాశాపవిమోచనా ! నీవు సర్వంబునకు నాధారంబని వేదంబులు చెప్పుచున్నవి. నీకు నాధారం 'బెయ్యదియో యెఱుంగను. నీవొక్కం డవే పరబ్రహ్మవట ! పురాణంబులు సెప్పెడి, తక్కిన మూర్తి భేదంబు లెవ్వరెవరో యెఱుంగను. నీవేమిటం బొరయనివాఁడవట ! ఈ ప్రపంచం బెవ్వరికొఱకుఁ బ్రకాశింపుచున్నయదియో కానఁబడదు. ఇవి యన్ని యును విచారించి చూతమనిన నీవ భేద్యుండవు. ఇటువంటి నీ మహిమకు నేము నాశ్చర్యంబు నొందుట గాని యొక యర్థంబు నిశ్చయింప నలవి గాదంటిని, తిలలలోని తై లంబువిధంబునఁ, గాష్ఠంబులోని యనలంబు