పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

37



80

చాణూరమర్దనా ! మిమ్ముం బేర్కోని పిలిచి యావాహనముచేసి మా యింటిలోపలఁ బీటపైఁ బెట్టి పూజించుచున్నవాఁడను. సముద్రుని కర్ఘ్య పాద్యా చమనీయంబుల నిచ్చినట్లు మేరుపర్వతంబునకు భూషణంబులు పెట్టినట్లు మలయాచలంబునకు గంధం బొసంగినట్లు వసంతునికి బుష్పంబులు సమర్పించినట్లు కస్తూరి మృగంబునకు ధూపం బిచ్చినట్లు సూర్యునికి దీపారాధన చేసినట్లు అమృత ప్రదుండవైన నీకు నై వేద్యం బిచ్చినట్లు నీరీతి మిమ్ము నలంకరించి యర్చింపుచున్నవాఁడ. నా చేతలకు మీ రేమని నవ్వుచున్నారో లజ్జింపక యుపచరింపుచున్నాఁడను. అయినం గానిమ్ము. తొల్లి, మీరు కృష్ణావతారంబై యుండెడు వేళ మిథిలానగరంబున శ్రుతదేవుం డనియెడి బ్రాహ్మణుండు మి మ్మింటికిఁ దోడ్కొనిపోయి పూజింపఁడె? మత్స్యావతారంబైన నాడు సత్యవ్రతుండను రాజు అర్ఘ్యము సమర్పించి మీరూపు దర్శింపఁడె? కుబ్జ మీకు గంధంబు లొసంగి సౌందర్యంబు వొందదా? మాలాకారుండు పువ్వులదండ లొసంగి మీచే మన్ననలు చేకొనఁడె? విదురుండు విందు వెట్టి వెలయఁడె? ఇవి చూచి మాకుఁ గొంచింపం బనిలేదు. నీవు భక్తసులభుండవు, మే మేపాటి యారాధించినం జేకొందువు. శ్రీ వేంకటేశ్వరా !

81

దేవచూడామణీ ! నీ పట్టినవి శంఖచక్రంబులు, ఎక్కినది గరుడవాహనము, తాల్చినవి చతుర్భుజంబులు, నీవు కావించిన కృత్యంబులు కంస కాళియ ముర నరకాసుర మర్ధనంబులు. ఇటువంటి నీవు నీలమేఘశ్యామవర్ణంబుతో విష్ణుస్వరూపుండవై నటియింపుచుండఁగాను నిన్నుఁజూచి దేవకీ వసుదేవులు నెటువలె బ్రమిసిరి? తపంబు సేయు చుండెడి వ్యాసవాల్మీకాది మునీంద్రులు మిమ్ముం జిక్కించుకొని మోక్షం బడుగ నేరీతి నేమఱిరి? శాస్త్రంబులు చదువుచుఁ బరబ్రహ్మం