పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

శ్రీ వేంకటేశ్వర వచనములు


బును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాంసుల వివేకంబు లెందువోయె? బ్రహ్మేంద్రాది దేవతలు మిమ్ము సేవించి మీ సాయుజ్యంబుఁబొందరైరి. వారి భాగ్యంబు లెక్కడనుండె? అది యట్లుండనిమ్ము; అనాది దేవుండనై యిప్పు డిందఱ హృదయంబులలో నున్నాఁడవట ! నిన్ను భావించి మఱచియున్నారము ; శ్రీ వేంకటేశ్వరా !

82

వరాహావతారా ! నిన్ను వెదకివెదకి వేసారితిని. నీవు పుట్టించిన బ్రహ్మండంబునకు నమస్కారంబు. అట్టి బ్రహ్మాండమునకు నాధారంబయిన నీ రోమకూపంబునకు దండంబు. అజాండములోని నీ విశ్వరూపంబునకు సాష్టాంగంబు. నీ తిరుపతులకు వందనంబు. చరాచరంబైన నీసృష్టికి నభివాదనంబు. నీ రూపంబు లయిన విగ్రహంబులకు మోడ్పుగేలు. 'నీ యంతర్యామిత్వంబునకు జోహారు. నీ వున్న శేషాచలంబునకు వందనంబులు సేయుచున్నవాఁడ. అందున్న నీ మూర్తికి శరణు. నన్ను నీ కరుణాదృష్టి నవలోకింపుము. నా యజ్ఞానంబు చెఱుపుము. నీ పాదంబులపై భక్తి నా కెల్లపుడుం బాయకుండఁ జేయుము. శ్రీ వేంకటేశ్వరా!

83

అమితకల్యాణగుణాకరా ! జాతికులశీలవిత్తంబులచేత నాకు గర్వంబు రేపుచున్నది నాచిత్తంబు ; దీనికి బుద్ది చెప్పుము, నాకు వశంబుగాదు. లోకంబులో వర్తమానంబు విచారించిచూచిన దాసీజనంబులకుం జెల్లునే యహంకారంబు; షండునకు వచ్చునే కామోద్రేకంబు; కార్యాతురునకుఁ గూడునే లోభంబు; దీనున గున్న దే బలిమి; ఆఁకొన్న వాని కుండునే మదంబు; అశక్తునకు వెలయునే మత్సరంబు; ఇటువంటి వారికెల్లను వారివారికి నాయాగుణంబులు సహజంబులు చేసి యిప్పించితివి; ఇవియెల్ల నసంభవబ్రహ్మచర్యంబులు. అందులకేమి ? నాకు